Wasim Rizvi : ఇస్లాం వదిలి..హిందూ మతంలోకి యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్

ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో

Wasim Rizvi : ఇస్లాం వదిలి..హిందూ మతంలోకి యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్

Razwi

Wasim Rizvi : ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో ఘజియాబాద్ లోని దస్నా దేవీ ఆలయ ప్రధాన పూజారి నరసింగానంద్ సరస్వతి సమక్షంలో ఓ యగ్నం నిర్వహించిన తర్వాత అధికారికంగా హిందూ మతంలోకి మారారు వసీం రజ్వీ.

ఆచారంలో భాగంగా దాస్నా దేవి ఆలయంలో ప్రతిష్టించిన శివలింగానికి పాలు సమర్పించారు రజ్వీ. హిందూ మతంలోకి మారిన నేపథ్యంలో వసీం పేరు కూడా మారింది. ఆయన కొత్త పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి. త్యాగి కమ్యూనిటీతో ఆయన అనుంబంధం కలిగి ఉండనున్నాడు.

ఈ సందర్భంగా వసీం రిజ్వీ(జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి)మాట్లాడుతూ…”హిందూయిజం ప్రపంచంలోని స్వచ్ఛమైన మతం. 1992లో ఇదే రోజున బాబ్రీ మసీదు కూల్చివేయబడినందున హిందూ మతంలోకి మారడానికి ఇదే డిసెంబర్ 6 పవిత్రమైన రోజుని నేను ఎంచుకున్నాను. నేను ఈ రోజు నుండి హిందూ మతం కోసం పని చేస్తాను. ముస్లింల ఓట్లు ఏ పార్టీకి పడవు. హిందువులను ఓడించేందుకు మాత్రమే వారు తమ ఓట్లను వేస్తారు” అని అన్నారు.

తన మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, మరణం తర్వాత తతను ఖననం చేయకూడదని వసీం రిజ్వీ తన వీలునామాలో పేర్కొన్నాడు. తన అంత్యక్రియల చితికి ఘజియాబాద్‌లోని దాస్నా దేవాలయానికి చెందిన హిందూ ధర్మకర్త నరసింగానంద్ సరస్వతి నిప్పంటించాలని కూడా రిజ్వీ పేర్కొన్నాడు.

కాగా,గత నెల 4వ తేదీన వసీం రిజ్వీ ఘజియాబాద్ లోని దస్నా దేవీ ఆలయంలో నరసింగానంద్ సరస్వతి సమక్షంలో విడుదల చేసిన ఓ బుక్ పై ముస్లిం కమ్యూనిటీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆ బుక్ కవర్ పేజీపై అర్థనగ్నంగా ఉన్న మహిళతో ఓ వ్యక్తి ఉన్న చిత్రం ఉండటంపై చాలా మంది ముస్లిం పెద్దలు,ఆల్ ఇండియా షియా లా బోర్డ్ సహా పలు ముస్లిం ఆర్గనైజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడైన మొహమ్మద్ పై వీసీం రజ్వీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారని వారు ఆరోపించారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని పలువురు ముస్లిం పెద్దలు కోరారు.

వసీం రిజ్వీ.. ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నవంబర్ 17న తన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు.రిజ్వీ ప్రవక్త మహమ్మద్‌ను దూషిస్తూ హిందీలో ఓ పుస్తకాన్ని రాశారని, అందులో ఇస్లాం,దానిని పాటించేవారిని అవమానించేలా అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో ఓవైసీ ఆరోపించారు. ఇస్లాం వ్యతిరేక శక్తలు రజ్వీ వెనుక ఉన్నాయని ఓవైసీ అన్నారు.

అయితే షియా ముస్లింలు మాత్రమే కాకుండా సున్నీ ముస్లింలు కూడా ఈ బుక్ ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పలు రాడికల్ ఇస్లామిక్ సంస్థలు తనను శిరచ్ఛేదం చేయాలని పిలుపునిచ్చాయని పేర్కొంటూ రజ్వీ ఓ స్టేట్ మెంట్ కూడా విడుదల చేశారు.

ALSO READ TTD properties : టీటీడీ చరిత్రలో తొలిసారి..తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల