TTD properties : టీటీడీ చరిత్రలో తొలిసారి..తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల

కలియుగ దైవం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు.తిరుమలలో ఏడు కొండలపై వెలిసిన శ్రీవారి ఆస్తులకు సంబంధించి టీటీడీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.

TTD properties : టీటీడీ చరిత్రలో తొలిసారి..తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల

Ttd Properties Releases White Paper

TTD properties Releases white paper : కలియుగ దైవం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు. వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో ఏడు కొండలపై వెలిసిన శ్రీవారి ఆస్తులకు కొదువేలేదు. వెండి బంగారం,వజ్రాలు వైఢూర్యాలు.. మరకత మాణిక్యాలు..స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీ పంచ లోహాలు ఇలా కొండలకొద్దీ ఉన్నాయి. టన్నుల కొద్దీ బంగారం, వెండీ శ్రీవారి ఖజానాలో మూలుగుతున్నాయి. నగలు నాణ్యాలకు కొదువేలేదు. భక్తులు ఎంతో ఇష్టంగా శ్రీవారికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించారు. కిలోల కొద్దీ బంగారం, వెండి, కట్టల కొద్దీ కరెన్సీలు ఇలా శ్రీవారి ఖజానాకు చేరాయి. కానీ ఇప్పటి వరకు శ్రావారికి ఆస్తులపాస్తులు ఎన్ని ఉన్నాయో లెక్కేలేదు. ఎవ్వరికి వివరాలు తెలియవు.

Read more : తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ కానుక, 2 కోట్ల విలువైన శంఖు చక్రాలు విరాళం

కానీ శ్రీవారి ఆస్తులపై తొలిసారిగా వెలిసిన శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదలైంది. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారికి ఉన్న ఆస్తులపై ఓ పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల కావడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే తొలిసారి కావటం గమనించాల్సిన విషయం. ఇప్పటిదాకా ఎప్పుడూ ఆ శ్రీనివాసుడి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల కాలేదు. స్వామివారి ఆస్తిపాస్తుల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని టీటీడీ ఇన్నాళ్టికి భావించింది. భక్తులు సమర్పించిన కానుకలపై పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.

భక్తులు సమర్పించిన కానుకలపై పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్ధేశంతో శ్రీవారి ఆస్తుల గురించి వివరాలతో శ్వేత పత్రం రిలీజ్ చేసింది టీటీడీ. రెండు పేజీల శ్వేతపత్రాన్ని ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు.

Read more : శ్రీవారికి 40 కిలోల బంగారు బిస్కెట్లు కానుక

శ్రీవారి పేరు మీద ఉన్న మొత్తం ఆస్తులు.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న మొత్తం ఆస్తులకు సంబంధించి అందుబాటులో ఉన్న వివరాలకు శ్వేత పత్రంలో పేర్కొంది. ఆస్తుల సంఖ్య 1,128. మొత్తంగా 8,088 ఎకరాల 89 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని వ్యవసాయం, వ్యవసాయేతర భూములు స్థలాలుగా విభజించింది. వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తోన్న సంఖ్య 233. ఇందులో 2,085 ఎకరాలు 41 సెంట్ల భూమి స్వామివారి పేరు మీద ఉంది. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 895. ఈ కేటగిరీలో ఉన్న స్థలాలు 6,003 ఎకరాల 48 సెంట్లు ఉన్నట్లు టీటీడీ తన శ్వేతపత్రంలో పొందుపరిచింది టీటీడీ. మరి శ్రీవారి వివరాలు తెలుసుకోవాలంటే..శ్వేతపత్రాన్ని www.tirumala.orgలో అందుబాటులో ఉంచారు.