Chhattisgarh : వెడ్డింగ్ కార్డుపై ధోనీ ఫోటో .. అభిమానం మామూలుగా లేదు
తాము ఇష్టపడే సెలబ్రిటీల కోసం అభిమానులు ఏమైనా చేస్తారు. ధోనీని ఎంతగానో ఆరాధించే ఓ అభిమాని తన పెళ్లికార్డులో ధోనీ ఫోటో వేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది.

Chhattisgarh
Wedding Card Viral : క్రికెట్ దిగ్గజం ధోనీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. వారిలో ఒక వీరాభిమాని తన పెళ్లికార్డులో ధోనీ ఫోటో వేసుకున్నాడు. అమితమైన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది.
Ambati Rayudu: ధోని అలా చేయడానికి కారణం అదే.. నిజంగా ఆ క్షణం ప్రత్యేకం
మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అసాధారణమైన వికెట్ కీపింగ్ నైపుణ్యంతో పాటు ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా ఆరాధించబడుతూ ధోనీ అభిమానుల మనసు కొల్లగొట్టాడు. ధోనీ వీరాభిమాని ఒకరు అతనిపై తనకున్న అభిమానం చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాయగఢ్ జిల్లాలోని తమ్నార్‌కి చెందిన దీపక్‌కి ధోనీ అంటే విపరీతమైన అభిమానం. ఎంతగా అంటే తన పెళ్లికార్డులో రెండువైపుల ధోనీ ఫోటోని వేయించుకున్నాడు. తలా అనే పదం వెడ్డింగ్ కార్డ్‌పై రాయించుకున్నాడు. ఈ కార్డు ఇప్పుడు వైరల్ గా మారింది.
దీపక్‌కి చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ధోనిని ఆదర్శంగా తీసుకునేవాడు. క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో తన విలేజ్ క్రికెట్ టీమ్‌కు బాధ్యతలు స్వీకరించాడు. తన జట్టుని అనేకసార్లు గెలిపించి అందరి మన్ననలు పొందాడు. తన విజయానికి కారణం ధోనీ లాంటి క్రికెటర్ వల్ల ప్రభావితమైన వ్యూహాలే అంటాడు దీపిక్. ధోనీ మీద తన అభిమానం చాటుకోవడానికి తన పెళ్లి సరైన వేదిక అనుకున్నాడు.
MS Dhoni: ధోని ఫ్యామిలీ ఫోటో.. బ్యాక్ గ్రౌండ్‌ను ఎడిట్ చేయాలని కోరిన అభిమాని.. ఆ తరువాత
అతని కాబోయే భార్య గరీమాతో పెళ్లికి సంబంధించిన వివరాలతో పాటు ధోనీ ఐకానిక్ జెర్సీ నంబర్ 7 మరియు అతని ఫోటోను గర్వంగా తన పెళ్లి కార్డుపై వేయించుకున్నాడు. జీవితంలో ముఖ్యమైన వివాహ వేడుకల్లో తను ఎంతగానో అభిమానించే ధోనీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే దీపక్ అభిమానం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు.