Hyd Drugs Case : ఆ లిస్టు తప్పు.. అసలు లెక్క మా దగ్గర ఉంది.. 5 ప్యాకెట్ల కొకైన్ సీజ్

ఫుడ్డింగ్ అండ్ పింక్ లో 24 గంటల పాటు లైసెన్స్ తీసుకుని.. డ్యాన్స్ ఫ్లోర్, డీజేతో పాటు.. 4 గంటల వరకు లిక్కర్ అమ్మడం, ఫుడ్ అమ్మడం చేస్తున్నట్లు తెలిపారు. చాలా మంది...

Hyd Drugs Case : ఆ లిస్టు తప్పు.. అసలు లెక్క మా దగ్గర ఉంది.. 5 ప్యాకెట్ల కొకైన్ సీజ్

West Zone Dcp

Hyd Drugs Case : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో 5 ప్యాకెట్లలలో కొకైన్ లభించిదని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. 148 మందితో వచ్చిన లిస్టు నిజం కాదని.. అసలు లిస్టు వేరే ఉందన్నారు. కస్టమర్ల పేర్లు వస్తున్నాయని.. డ్రగ్స్ వినియోగించినట్లు తేలితే.. వారి పేర్లు వెల్లడిస్తామని ప్రకటించారు. డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకుని.. దర్యాప్తు చేయడం జరుగుతుందని.. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే వారిని అరెస్టు చేస్తామని ప్రకటించారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో 148 మంది అక్కడున్నట్లు.. వీరందరిపై నిఘా పెట్టామని, తమ దర్యాప్తులో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలలేదని.. మరింత దర్యాప్తులో వారి పాత్ర ఏమైనా ఉందా అని తేలితే అరెస్టు చేస్తామన్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో డ్రగ్స్ పార్టీ జరిగిందనే ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో… వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాతో మాట్లాడారు.

Read More : Pudding And Mink : డ్రగ్స్ కేసుతో నా కూతురికి సంబంధం లేదు.. ఆ పబ్ ఆమెది కాదు – రేణుకా చౌదరి

ఫుడ్డింగ్ అండ్ పింక్ లో 24 గంటల పాటు లైసెన్స్ తీసుకుని.. డ్యాన్స్ ఫ్లోర్, డీజేతో పాటు.. 4 గంటల వరకు లిక్కర్ అమ్మడం, ఫుడ్ అమ్మడం చేస్తున్నట్లు తెలిపారు. చాలా మంది క్రౌడ్ ఉందని, డ్రగ్స్ ఉన్నాయనే సమాచారం తమకు వచ్చిందన్నారు. దాదాపు 148 మంది అక్కడున్నట్లు గుర్తించామన్నారు. అందులో 20 మంది సిబ్బంది, 38 మంది యువతులు, 90 మంది పురుషులున్నారన్నారు. ఐదు ప్యాకెట్లు సీజ్ చేసినట్లు, అందులో కొకైన్ ఉన్నట్లు తేలిందన్నారు. వెంటనే కస్టమర్లను తీసుకొచ్చి… వారి డిటైల్స్ సేకరించామన్నారు. ఫుడ్డింగ్ అండ్ పింక్ యజమానులైన అర్జున్ వీరమాచినేని, అభిషేక్ ఇద్దరిపై కేసు పెట్టామన్నారు. డ్రగ్ విక్రయిస్తున్నట్లు తేలడంతో వారిపై కేసులు పెట్టామన్నారు. కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ ఇన్స్ పెక్టర్ కు బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందన్నారు. ఏ డిపార్ట్ మెంట్ ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నిర్లక్ష్యం వ్యవహరించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. అందులో భాగంగా బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ ను సీపీ ఆనంద్ సస్పెండ్ చేశారన్నారు. ప్రత్యేకంగా కోడ్ జనరేట్ చేసి..లోనికి పంపించడం జరుగుతోందని తెలిపారు.

Read More : Pudding And Mink : పేరుకేమో ఆయుర్వేదిక్‌ బార్‌.. లోపల జరిగేదే వేరు, బట్టబయలైన నిజస్వరూపం

తెలంగాణ రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్, నేచురల్ డ్రగ్స్ ఎక్కువ అవకుండా అరికట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం జరిగిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్నది.. అభివృద్ధిలో దూసుకపోతున్న రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టాలని ప్రతొక్క అధికారికి ఆదేశాలు ఇచ్చారన్నారు. సీపీ ఆనంద్ వెంటనే రియాక్ట్ అయ్యారని, నార్కోటింగ్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత రెండు నెలల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్న విషయం అందరికీ తెలిసిందేన్నారు. ఎంటర్ టైన్ మెంట్స్, పబ్బులు, బార్ల వద్ద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైతే సమస్య వస్తే.. తమకు ప్రజలు సమాచారం అందిస్తూ.. సహకారం అందిస్తున్నట్లు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.