Child Care : పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతంటే?

బయటి పనుల్లో ఎంత బిజీగా ఉన్న జీవితంలో కొంత సమయాన్ని పిల్లలకు కోసం కేటాయించాలి. భార్యభర్తలు ఉద్యోగులైతే పిల్లలు ఒంటరివారై నాలుగోడలకే పరిమితమవ్వటం వల్ల వారికి బంధాలు, బంధుత్వాల విలువలు తెలియకుండా పోతున్నాయి.

Child Care : పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతంటే?

Parents In Child Care

Child Care : పిల్లల సంరక్షణ తల్లిదండ్రులు ఇరువురు బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో భార్యభర్తలిరువురు సంపాదన పరులుగా మారటంతో పిల్లల ఆలనాపాలన బాధ్యత కష్టతరంగా మారింది. ఒకప్పుడు ఇంటిపట్టునే ఉండి మహిళలు పిల్లల బాధ్యతలను చూసుకుంటే మగవారు మాత్రం సంపాదనపై దృష్టిపెట్టేవారు. అయితే ప్రస్తుతమున్న పరిస్ధితుల్లో పిల్లల బాధ్యతల నిర్వాహణలో తల్లిదండ్రులు ఏమాత్రం శ్రద్ధ చూపించకపోయినా వారి భవిష్యత్తు జీవితాన్ని సక్రమమార్గంవైపు తీసుకువెళ్ళటంలో ఆటుపోట్లను చవిచూడాల్సి వస్తుంది.

పిల్లలను పెంచటం అంటే వారికి కావాల్సిన తిండి, విద్య, సదుపాయలను కల్పించటంతోపాటు సమాజ నిర్మాణంలో వారిని భాగస్వాములను తీర్చిదేద్దేలా తల్లిదండ్రులు ముఖ్యభూమిక పోషించాలి. మన చుట్టూ ఉండే వాతావరణమే పిల్లల వ్యక్తిత్వ వికాసంపై ప్రభావం చూపుతుంది. స్నేహితులు , బంధువులతో సఖ్యతగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎదుగుతున్న పిల్లల ముందు చీటికి మాటికీ తగాదాలు పడటం, ఇతరుల గురించి అవమానంగా మాట్లాడుకోవటం , ఇతరుల గురించి పిల్లల ముందు చెడ్డగా మాట్లాడటం వంటివి ఏమాత్రం చేయకూడదు. ఇలా చేయటం వల్ల పిల్లల భ్యవష్యత్తు వ్యవహారశైలిపై దీని ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయి.

పిల్లల సొంత ఆలోచనలు, కోరికలకు విలువ ఇవ్వటం మంచిది. వారి అభిప్రాయాలు, అభిరుచులు చెప్పుకునే అవకాశం కల్పించాలి. ఇది నాది, నాసొంతం, నా అంత గొప్పవాడులేరు, అన్న భావన పిల్లల మనస్సులో లేకుండా అందరితో కలసిమెలసి స్నేహపూర్వకంగా మెలిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు చెడు మార్గం వైపు పయనిస్తే దాని పర్యవసానాలు అనుభవించాల్సింది కూడా తల్లిదండ్రులే. చివరకు సమాజం సైతం పెంచిన పెంపకమంటూ తల్లిదండ్రులపైనే విమార్శనాస్త్రాలు
సందిస్తుంది.

బయటి పనుల్లో ఎంత బిజీగా ఉన్న జీవితంలో కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించాలి. భార్యభర్తలు ఉద్యోగులైతే పిల్లలు ఒంటరివారై నాలుగోడలకే పరిమితమవ్వటం వల్ల వారికి బంధాలు, బంధుత్వాల విలువలు తెలియకుండా పోతున్నాయి. ఒకప్పుడు నానమ్మలు, తాతయ్యలు పిల్లల పెంపకం విషయంతోపాటు, వారికి సరైన నడవడికకు తోడ్పాటుగా నిలిచేవారు. ప్రస్తుతం ఆపరిస్ధితి అలా లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం దొరికిన సందర్భంలో సామాజిక అంశాలపై పిల్లలతో చర్చించండి. కుల,మత బేధాలు ఆచిన్ని మనస్సుల్లో రానీయకుండా జాగ్రత్త పడండి. ఆడపిల్లలను గౌరవించటం, తోటివారితో సఖ్యతగా మెలగటం ఎలాగే నేర్పించండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించటం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది.