ఒకే అకౌంట్.. అన్ని డివైజ్‌ల్లో ఒకేసారి లాగిన్‌.. వాట్సాప్ టెస్టింగ్ మొదలెట్టేసింది..!

  • Published By: srihari ,Published On : June 13, 2020 / 09:55 AM IST
ఒకే అకౌంట్.. అన్ని డివైజ్‌ల్లో ఒకేసారి లాగిన్‌.. వాట్సాప్ టెస్టింగ్ మొదలెట్టేసింది..!

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం మల్టీ డివైజ్ లాగిన్లపై టెస్టింగ్ మొదలుపెట్టామని వాట్సాప్ తెలిపింది. ఇప్పటివరకూ ఒకే అకౌంట్ ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే.. డెస్క్ టాప్ వెబ్ వెర్షన్ .. లాగిన్ అయిన డివైజ్ నుంచి యాక్సస్ చేసుకుంటున్నారంతే.. రాబోయే కొత్త ఫీచర్ ద్వారా ఒకే అకౌంట్ ను మల్టీ డివైజ్ ల్లో లాగిన్ కావొచ్చు.. అంతేకాదు.. సెర్చింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తోంది. చాట్ క్లియర్ వంటి మరెన్నో ఫీచర్లలో కొత్త అప్ డేట్స్ తీసుకురానుంది. ఫేస్ బుక్ సొంత సంస్థ వాట్సాప్ ఇప్పటికే టన్నుల కొద్ది ఇతర ఫీచర్లను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. అందులో ఇతర ఫీచర్లలో లేటెస్ట్ బీటా అప్ డేట్స్ కూడా ఉన్నాయి. లేటెస్ట్ బీటా iOS, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరిన్ని ఫీచర్లను టెస్టింగ్ చేస్తున్నట్టుగా WABetaInfo నివేదించింది. 

ప్రస్తుతం.. వాట్సాప్ ఏదైనా ఒక అకౌంట్ ఒక డివైజ్ లో లాగిన్ అయితే.. అందులో మాత్రమే ఆ అకౌంట్ యాక్సస్ చేసుకోగలం. మరో డివైజ్ లో కూడా అదే అకౌంట్ లాగిన్ కావాలంటే మాత్రం.. ముందుగా లాగిన్ అయిన డివైజ్ నుంచి లాగౌట్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మరో కొత్త డివైజ్ లోకి లాగిన్ అనుమతి ఉంది. రాబోయే కొత్త ఫీచర్ ద్వారా అలాంటి ఇబ్బంది యూజర్లకు ఉండబోదు. సులభంగా ఒకే అకౌంట్ ఒకే సమయంలో వేర్వేరు డివైజ్ ల్లోకి లాగిన్ కావొచ్చు… ఈ కొత్త ఫీచర్ ద్వారా WABetaInfo నివేదిక ప్రకారం.. ఒకేసారి 4 డివైజ్ ల్లో ఒకే వాట్సాప్ అకౌంట్ లాగిన్ అయ్యే పరిమితి ఉంటుందని పేర్కొంది. నాలుగు కంటే ఎక్కువ డివైజ్ ల్లో లాగిన్ అయ్యేందుకు అనుమతి ఉండదు. 
WhatsApp begins testing multi-device logins

ఈ ఫీచర్ తో పాటు.. వాట్సాప్ ముఖ్యమైన ఇతర సెర్చ్ అప్ డేట్స్ కూడా తీసుకొస్తోంది. ‘Search by date’ ఫీచర్ రానుంది. గతంలో పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు, మెసేజ్ పోస్టులను చాట్ బాక్సులో ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. గ్రూపు చాట్ లోనూ ఇదే ఫీచర్ రానుంది. అంతేకాదు.. మీ స్మార్ట్ ఫోన్లో ఎంతవరకు సోషల్ మీడియా డేటా స్టోరేజీ అయిందో కూడా చెక్ చేసుకోనే Storage Usage feature అనే ఫీచర్ తీసుకొస్తోంది.

దీని ద్వారా మీ ఫోన్లో స్టోరేజీ వివరాలను తెలియజేస్తుంది. వాట్సాప్ తీసుకొచ్చే మరో అప్ డేట్.. clear entire chats.. ఈ ఫీచర్ అప్ డేట్ ద్వారా ‘starred’ మెసేజ్ లు మినహా చాట్ బాక్సులోని మిగతా డేటా అంతా క్లియర్ చేసుకోవచ్చు. ప్రస్తుతమున్న బేసిక్ క్లియర్ చాట్ ఫీచర్ కన్నా ఎంతో బెటర్ అని చెప్పవచ్చు. చివరిగా.. వాట్సాప్ మరో ఆప్షన్ కూడా అందిస్తోంది.. ShareChat Videoకు కూడా వాట్సాప్ సపోర్ట్ అందిస్తోంది. కానీ, ఈ సర్వీసు కేవలం భారత్ బయటి దేశాల్లో మాత్రమే అందుబాటులోకి రానుంది.