WhatsApp Mini-Guide : ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ స్టోరేజీని ఎలా క్లియర్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

WhatsApp Mini-Guide : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) భారత మార్కెట్లో అత్యంత పాపులర్ అయింది.

WhatsApp Mini-Guide : ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ స్టోరేజీని ఎలా క్లియర్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

WhatsApp Mini-Guide _ A mini-guide on how to clear WhatsApp storage on Android devices

WhatsApp Mini-Guide : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) భారత మార్కెట్లో అత్యంత పాపులర్ అయింది. ప్రతిరోజూ వాట్సాప్ యూజర్లు సాధారణ గుడ్ మార్నింగ్ మెసేజ్‌లను పంపుతుంటారు. సింగిల్ వాట్సాప్ అకౌంట్ల నుంచి గ్రూపు వాట్సాప్ అకౌంట్ల వరకు అన్నింట్లోనూ గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు ఎక్కువగా వస్తుంటాయి. దాంతో ఆండ్రాయిడ్ వాట్సాప్ స్టోరేజీవెంటనే నిండిపోతుంటుంది. నిత్యం పెద్దమొత్తంలో స్టోర్ అయ్యే అన్ వాంటెడ్ మీడియాను మాన్యువల్‌గా డిలీట్ చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని.

ముఖ్యంగా, వాట్సాప్ స్టోరేజ్ టూల్‌ను అందిస్తుంది. వినియోగదారులు ఎక్కువ స్టోరేజీని వినియోగించే చాట్‌ను గుర్తించడానికి అనుమతిస్తుంది. వాట్సాప్ స్టోరేజీ ఫైల్‌లను సైజు ప్రకారం క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. వాట్సాప్ స్టోరేజ్ స్పేస్‌ను ఎలా ఖాళీ చేయాలో మీకు తెలుసా? అయితే మీకోసం ఇక్కడ ఫుల్ గైడ్ అందుబాటులో ఉంది. అదేంటో ఓసారి చూద్దాం..

* WhatsApp ఓపెన్ చాట్స్ ట్యాబ్‌కు వెళ్లండి. ఇప్పుడు మరిన్ని ఆప్షన్ల క్లిక్ చేసి, సెట్టింగ్‌లకు నావిగేట్ చేయండి.
* స్టోరేజీ, డేటాపై Tap చేయండి. ఇప్పుడు మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ గుర్తించండి.
* ఎగువన, యూజర్లు అనేకసార్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ చూడవచ్చు. దాని కింద,’5MB కన్నా భారీ ఫైల్‌లు ఉంటాయి.
* ఇప్పుడు పైన పేర్కొన్న సెక్షన్లను ఒక్కొక్కటిగా ఎంచుకుని తొలగించే ఆప్షన్ Tap చేయండి. యూజర్లు వాటన్నింటినీ ఎంచుకుని, Delete చేయవచ్చు.
* ఇంకా, Delete చేసిన అన్ని ఐటెమ్‌లను ఎంచుకుని, యాప్ కుడివైపు ఎగువన కనిపించే డిలీట్ ఐకాన్‌పై Tap చేయండి.
* Search ఆప్షన్ ఉపయోగించి యూజర్లు తమ చాట్ నుంచి మీడియాను కూడా Delete చేయవచ్చు.

WhatsApp Mini-Guide _ A mini-guide on how to clear WhatsApp storage on Android devices

WhatsApp Mini-Guide _ A mini-guide on how to clear WhatsApp storage

Read Also : WhatsApp Multiple Chats : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు త్వరలో మల్టీపుల్ చాట్లను ఒకేసారి ఎంచుకోవచ్చు..!

గత కొన్ని ఏళ్లుగా వాట్సాప్ యూజర్లు కొత్త ఏడాది శుభాకాంక్షల నుంచి ఇతర పండుగల వరకు శుభాకాంక్షలు పంపడానికి స్టిక్కర్లను అందిస్తోంది. మీరు మీ ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు స్టిక్కర్‌లను పంపుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్‌లో స్టిక్కర్‌ (Whatsapp Stickers)లను ఎలా పంపాలో తెలుసుకోవచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్‌ (Happy New Year Stickers)లను పంపడానికి, వినియోగదారు ముందుగా Google Play Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అలా చేయడానికి, Play Storeకి వెళ్లి.. అక్కడ నుంచి మీకు నచ్చిన ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు మీకు నచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, దాన్ని ఓపెన్ చేసి మీ WhatsAppకి యాడ్ చేయండి. యూజర్లు తమ యాప్‌లో మల్టీ స్టిక్కర్ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. అన్నీ వాటి పక్కన ప్లస్ (+) ఆకారంలో Add బటన్‌తో ఉంటాయి. వారి WhatsApp యాప్‌లో ఈ స్టిక్కర్‌లను యాడ్ చేయడానికి బటన్‌పై Tap చేయండి.

యాప్‌కు ఈ స్టిక్కర్‌లను యాడ్ చేసిన తర్వాత, యూజర్లు వాట్సాప్‌కి వెళ్లి, ఏదైనా కాంటాక్టుతో చాట్ విండోను ఓపెన్ చేయాలి. తమకు నచ్చిన స్టిక్కర్‌లను ఎంచుకోవడం ద్వారా ఏదైనా స్టిక్కర్‌ను పంపవచ్చు. వినియోగదారులు ఎమోజి సెక్షన్ ఓపెన్ చేసి.. స్టిక్కర్‌ల కోసం కుడివైపున ఉన్న ట్యాబ్‌కు వెళ్లవచ్చు.

అన్ని కొత్త హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్‌లు ఉంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రమే ఈ మెథడ్ ఉపయోగించి స్టిక్కర్‌లను పంపవచ్చు. Apple iPhone యూజర్లు తమ ఆండ్రాయిడ్ స్నేహితులను తమకు ఇష్టమైనదిగా గుర్తించగల స్టిక్కర్‌లను పంపమని అడగవచ్చు. వాట్సాప్ స్నేహితులతో షేర్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Online : వాట్సాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ ఎవరికి తెలియకుండా ఇలా హైడ్ చేయొచ్చు..!