WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీరు వాట్సాప్ మెసేజ్ టైప్ చేయాల్సిన పనిలేదు. టైపింగ్ లేకుండానే మెసేజ్ ఈజీగా పంపుకోవచ్చు. కీప్యాడ్ ద్వారా టైప్ చేయకుండా మెసేజ్ పంపే ఫీచర్ ఉంది.

WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!

Whatsapp Tricks Now Send Whatsapp Messages Without Even Typing, Know The Process

WhatsApp Tricks : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీరు వాట్సాప్ మెసేజ్ టైప్ చేయాల్సిన పనిలేదు. టైపింగ్ లేకుండానే మెసేజ్ ఈజీగా పంపుకోవచ్చు. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు టైపింగ్ చేయకుండానే పంపుకోవచ్చు. కీప్యాడ్ ద్వారా టైప్ చేయకుండా మెసేజ్ పంపే ఫీచర్ ఒకటి వాట్సాప్‌లో ఉంది. అదే.. Voice Recognition ఫీచర్.. ఈ సంగతి చాలామందికి తెలియదు. సాధారణంగా వాట్స‌ప్ ద్వారా చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీగా మెసేజ్ పెట్టాల్సి వస్తే.. టైప్ చేసే పరిస్థితి ఉండదు.
China Best Cars : ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లను తయారుచేస్తున్న డ్రాగన్ చైనా!

ఇలాంటి సమయాల్లో ఈజీగా వాయిస్ టెక్స్ట్ మెసేజ్ పంపుకునేందుకు ఈ ఫీచర్ పనిచేస్తుంది. దీనికి మీరు టెక్స్ట్ టైప్ చేయాల్సిన పనిలేదు. వాట్స‌ప్ చాట్ బాక్స్‌లో వాయిస్ పంపించే ఆప్ష‌న్ ఉందని తెలుసు. కేవ‌లం వాయిస్‌ను ఒక ఆడియో ఫైల్‌లా పంపిస్తుంది.. మెసేజ్‌లా పంపించ‌దు. మీరు పంపే వాయిస్.. మెసేజ్‌ రూపంలో వెళ్లాలంటే .. మీ ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు గూగుల్ అసిస్టెంట్ అవసరం పడుతుంది. ఈ ట్రిక్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మాత్రమే వ‌ర్క్ అవుతుంది.

2015లోనే వాట్స‌ప్ టెక్స్ట్ మెసేజ్‌ల‌ను వాయిస్ రూపంలో పంపేందుకు గూగుల్ అసిస్టెంట్ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచ‌ర్‌ను ఐఫోన్ల‌లోనూ అందుబాటులోకి వచ్చింది. యాపిల్ సిరిని ఉప‌యోగించి వాయిస్ మెసేజ్‌ల‌ను పంపుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్‌ ద్వారా టెక్స్ట్ టైప్ చేయ‌కుండానే మెసేజ్‌ల‌ను పంపుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. మీ ప్రొఫైల్ ఫోటో రైట్ కార్న‌ర్ మీద క్లిక్ చేయండి. కొంచెం కిందికి స్కోల్ చేయండి. గూగుల్ అసిస్టెంట్ ఫంక్ష‌న్‌ ఆన్ చేయండి.

గూగుల్ అసిస్టెంట్ ఆన్ చేశాక.. Hey గూగుల్ లేదా OK గూగుల్ అంటే.. వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. వాట్స‌ప్ చాట్‌లో కాంటాక్ట్ పేరు చెప్పగానే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేస్తుంది. ఆ వ్యక్తికి ఏం మెసేజ్ పంపించాలో వాయిస్ అసిస్టెంట్‌కు చెప్పాలి. మీ మెసేజ్‌ను ఆ వ్య‌క్తిని టెక్స్ట్ రూపంలో గూగుల్ అసిస్టెంట్ అందిస్తుంది. అప్పుడు మీరు ఏ టెక్స్ట్ కూడా టైప్ చేయాల్సిన పనిలేదు. గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాట్స‌ప్ మెసేజ్‌ను ఈజీగా పంపుకోవచ్చు.
Encryption Key : వాట్సాప్ యూజర్లు.. మీ చాట్ బ్యాకప్ ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు!