Delhi Air Pollution: ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్‌లా మారాల్సిందేనా?

ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్‌లా మారాల్సిందేనా? ప్రతీ సంవత్సరం సుప్రీంకోర్టులో కాలుష్యం గురించి పిటీషన్ దాఖలు కావటం విచారించటం..ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయటం కొనసాగుతోంది. కానీ సంవత్సరాలు గడుస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావటంలేదు.

Delhi Air Pollution: ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్‌లా మారాల్సిందేనా?

Delhi Air Pollution 2022

Delhi Air Pollution: అసలు.. భారత రాజధాని అంటే.. ఉండాల్సింది ఇలాగేనా? స్వచ్ఛమైన గాలి సంగతి సరే.. కనీసం పీల్చడానికి కూడా గాలి దొరికే పరిస్థితులుండవా? ప్రతి ఏటా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందని తెలుసు. అందుకు కారణాలేంటో కూడా తెలుసు. మరి.. దీనికి శాశ్వత సొల్యూషన్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు.. ఆ దిశగా చర్యలెందుకు చేపట్టడం లేదు? ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? నవంబర్ టు ఫిబ్రవరి.. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌లా మారాల్సిందేనా? జనం.. అందులో మగ్గాల్సిందేనా?ప్రతీ సంవత్సరం సుప్రీంకోర్టులో కాలుష్యం గురించి పిటీషన్ దాఖలు కావటం విచారించటం..ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయటం కొనసాగుతోంది. కానీ సంవత్సరాలు గడుస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావటంలేదు.

దేశ రాజధాని ఢిల్లీలో.. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో.. చలికాలం వచ్చిందంటే చాలు.. అందరి ముక్కులకు పరీక్ష మొదలైపోతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ.. ఇళ్లలో కూడా బలవంతంగా మాస్క్‌లు ధరించాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయ్. బయటకు వెళ్లినప్పుడంటే ఓకే.. కానీ.. ఇళ్లలో కూడా మాస్క్‌లు ధరించాల్సిన దారుణమైన పరిస్థితులు ఉంటున్నాయంటే.. సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వింటర్ మొదలైతే చాలు.. రాజధాని నగరంలో పీల్చే గాలి విషంలా మారిపోతుంది. ఇందుకు.. రుతుపవనాల తిరోగమనం తర్వాత.. ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే.. మానవ తప్పిదాలు మరో కారణం. ఇవన్నీ.. ఎయిర్ పొల్యూషన్ స్థాయిని మరింత పెంచి.. పీల్చే గాలిని విషంగా మార్చేస్తున్నాయ్.

ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయ్. అడుగు బయటపెట్టాలంటేనే.. జనం వణికిపోతున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపలేని పరిస్థితి. వాళ్లను సరదాగా బయటకు తీసుకెళ్లలని దుస్థితి. ఆడుకోవటానికి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే చేయి పట్టి ఇళ్లలోకి లాగే పరిస్థితులు నెలకొన్నాయ్. సింపుల్‌గా చెప్పాలంటే.. క్యాపిటల్ సిటీలో ఎయిర్ ఎమర్జెన్సీ మొదలైంది. ఇదంతా.. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్లే జరుగుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లో ఈ వ్యర్థాలను కాల్చడమనేది.. ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం ఢిల్లీకే కాదు.. దేశం మొత్తం తెలుసు. నిజానికి.. ఎయిర్ పొల్యూషన్ ఒక్క ఢిల్లీని మాత్రమే వేధిస్తున్న సమస్య కాదు. రాజధాని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోనూ పరిస్థితులు దారుణంగానే ఉంటున్నాయ్. ఆ ప్రభుత్వాలు కూడా సరైన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయ్.

Delhi Air Pollution : ఢిల్లీ పొల్యూషన్‌కి.. సొల్యూషనే లేదా?

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటూ.. సుప్రీంకోర్టులో ప్రతి ఏటా పిటిషన్లు దాఖలవుతూనే ఉంటాయ్. వాటిపై.. ధర్మాసనం విచారణ జరపడం, తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. కానీ.. ఫలితాలు మాత్రం శూన్యం. ఢిల్లీ పొల్యూషన్‌పై పిటిషన్ దాఖలైన ప్రతిసారీ.. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించడం, పంజాబ్, హర్యానాలో.. పంట వ్యర్థాలు తగలబెట్టకుండా అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటని అడగడం సాధారణం. అయినా.. ఎప్పటిలాగే ఢిల్లీలో పొల్యూషన్ కనిపిస్తూనే ఉంది. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టే ఆదేశాలు జారీచేస్తున్నా.. ఒక్క ఏడాది కూడా ఆ దిశగా అడుగులు పడటం లేదు. శీతాకాలం ముగిశాక.. ఈ ఇష్యూ ఏమైపోతుందో కూడా ఎవరికీ తెలియదు. మళ్లీ.. వింటర్ మొదలవగానే.. ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైపోతుంది.

ఎయిర్ పొల్యూషన్ కారణంగా.. చాలా మంది శ్వాసకోస సంబంధమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు.. వాయి కాలుష్యం వల్ల.. భారతీయుల జీవితకాలం కూడా ఐదేళ్లు తగ్గిపోతోందని నివేదికలు సూచిస్తున్నాయ్. దీంతో.. మరింత ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయ్. రోజురోజుకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతుండటంతో.. ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం ఎక్కువ రోజులు కొనసాగితే.. దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల.. అంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

వాయు కాలుష్యం అనేక విధాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది. కళ్ల మంట, వాపు, ఎర్రబడటం, కళ్లలో నుంచి నీళ్లు కారడం, పొడిబారడం, దురద రావడం, ముక్కులో మంట, పెదవులపై వింత రుచి వంటి సమస్యలతో.. చాలా మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇవన్నీ కాలుష్యం స్వల్పకాలిక ప్రభావాలు. ఈ పొల్యూషన్ ఇలాగే కొనసాగితే.. దీర్ఘకాలిక సమస్యలైన ఛాతీ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. గాలిలో ఉండే విషపూరిత రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి వెళితే.. అది అనేక అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువయ్యాక.. ఢిల్లీలో న్యూమోనియా, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అంతేకాదు.. మెదడు సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రతి ఒక్కరూ.. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఎన్‌-95 మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు.

వీటన్నింటికి మించి.. వీలైనంత త్వరగా.. ఎయిర్ పొల్యూషన్ కట్టడికి శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు దేశ రాజధాని వాసులు. అయితే.. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయిందని.. పంట వ్యర్థాల కాల్చివేత సమస్యపై.. తాము ఆలోచిస్తున్నామని చెబుతున్నారు కేజ్రీవాల్. తమకొక ఏడాది టైమ్ ఇవ్వాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి.. ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కనుగొంటామని చెబుతున్నారు కేజ్రీవాల్.