Rashmika Mandanna: తమిళ వ్యక్తినే పెళ్లాడతానంటోన్న రష్మిక

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ గార్జియస్, టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు రష్మిక మంధాన. దక్షిణాదిలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లిపోతున్న అమ్మడికి బాలీవుడ్ కూడా వెల్ కమ్ చెప్పేసింది. అమితాబ్ బచ్చన్, సిద్దార్థ్ మల్హోత్రా లాంటి సీనియర్ యాక్టర్లతో నటించే అవకాశం కొట్టేసింది.

Rashmika Mandanna: తమిళ వ్యక్తినే పెళ్లాడతానంటోన్న రష్మిక

Rashmika Mandana

Rashmika Mandanna: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ గార్జియస్, టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు రష్మిక మంధాన. దక్షిణాదిలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లిపోతున్న అమ్మడికి బాలీవుడ్ కూడా వెల్ కమ్ చెప్పేసింది. అమితాబ్ బచ్చన్, సిద్దార్థ్ మల్హోత్రా లాంటి సీనియర్ యాక్టర్లతో నటించే అవకాశం కొట్టేసింది. నేషనల్ క్రష్ అయిన రష్మిక.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ప్రతి అప్ డేట్ నూ పంచుకుంటారు.

చాలా ఓపెన్ గా మాట్లాడతానంటూ చెప్పే.. రష్మిక ఓ ఇంగ్లీష్ మీడియా ముందు నిజంగానే ఓపెన్ అయిపోయారు. తనకు కాబోయే భర్త తమిళ వ్యక్తే అయి ఉండాలని చెప్పారు.

నాకు తమిళనాడు కల్చర్ బాగా నచ్చింది. ప్రత్యేకించి ఇక్కడ ఫుడ్. ఈ తమిళ ఫుడ్ తో ప్రేమలో పడిపోయా. ఏదో ఒకరోజు ఓ తమిళ వ్యక్తినే పెళ్లాడి తమిళనాడుకే కోడలిగా రావాలనుకుంటున్నా’ అని చెప్పేశారు.

నిజ జీవితం విషయానికి వస్తే తన సహ నటుడితో లవ్‌లో పడి ఆ పెళ్లి వరకూ వెళ్లి రద్దు చేసుకుంది. ముందుగా తనకు కాబోయే భర్త సినిమా రంగానికి చెందిన వాడు కాకూడదని అనుకుందట. రక్షిత్‌ శెట్టి పరిచయం అవగానే నచ్చేయడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారట. రెండేళ్లు వాయిదా తర్వాత అవకాశాలు అధికం అవ్వడంతో పెళ్లిని పక్కకుపెట్టేసింది.