Fast Internet : సూపర్ ఫాస్ట్ ఇంటర్‌‌నెట్, క్షణాల్లో మూవీ డౌన్‌‌లోడ్

సరికొత్త టెక్నాలజీ వచ్చేసింది. వైఫై స్టాఈ.వైఫై స్టాండర్డ్ నే వైఫై 6ఈ అంటారు. 2022 వరకు వైఫై 6ఈ స్టాండర్డ్ నే మెయిన్ స్ట్రీమ్ గా తీసుకరానున్నారు.

Fast Internet : సూపర్ ఫాస్ట్ ఇంటర్‌‌నెట్, క్షణాల్లో మూవీ డౌన్‌‌లోడ్

Internet

Wi-Fi 6E : వైఫై..ఇప్పడు ప్రతింట్లో ఉంటోంది. దీంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే..ఎక్కువ మంది యూజర్లు లాగిన్ అయితే..సమస్యలు వస్తుంటాయి. నెట్ వర్క్ రద్దీ పెరిగి..ఇంటర్నెట్ స్లో అయిపోవడం, సడెన్ గా ఆగిపోవడం జరుగుతుంటుంది. దీంతో కొందరు తీవ్ర నిరుత్సాహానికి గురవుతుంటారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ వచ్చేసింది. వైఫై స్టాఈ.వైఫై స్టాండర్డ్ నే వైఫై 6ఈ అంటారు.

Read More : Volcanoes Erupt: ఒకేసారి బద్దలైన 3 అగ్నిపర్వతాలు.. మానవాళికి ముప్పు ఉందా?

2022 వరకు వైఫై 6ఈ స్టాండర్డ్ నే మెయిన్ స్ట్రీమ్ గా తీసుకరానున్నారు. యాపిల్ లాంటి స్మార్ట్ ఫోన్ల బ్రాండ్స్ అన్నింటిలోనూ..వైఫై 6 టెక్నాలజీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూటర్ OEMSలోనూ..ఇదే టెక్నాలజీ వాడుతున్నారు. దీనికారణంగా..ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. క్షణాల్లో మూవీని డౌన్ లోడ్ చేసుకొనే ఛాన్స్ ఉందంటున్నారు.

Read More : Congress Protest : ‘ట్విట్టర్‌ పక్షి’ని వండుకుని తిన్న కాంగ్రెస్ నేతలు

వైఫై 6ఈ టెక్నాలజీ..6GH నెట్ వర్క్ ను సపోర్టు చేసే డివైజ్ లలో ఈ వర్క్ అవుతుందని, ఎంత మంది నెట్ వర్క్ కు కనెక్ట్ అయినా ఎలాంటి సమస్యలు రావంటున్నారు. వైఫై 6ఈలో బ్యాండ్ 6జీహెచ్ జెడ్ ఉంటుందని, దీనినే స్పెక్ట్రమ్ అంటారు. వైఫై 6 టెక్నాలజీతో 6జీహెచ్ జెడ్ స్పెక్ట్రమ్ తో వచ్చేదే ఈ వైఫై 6ఈ స్టాండర్డ్.
ఇక్కడ వైఫై 6ఈ నెట్ వర్క్ ను తీసుకోవాలంటే…6ఈ ఫీచర్ ను సపోర్టు చేసే రూటర్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్రాండ్ సర్వీసులు అందించే పలు నెట్ వర్క్స్ జియో ఫైబర్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, యాక్ట్ ఇదే టెక్నాలజీని వాడుతున్నాయి.