Volcanoes Erupt: ఒకేసారి బద్దలైన 3 అగ్నిపర్వతాలు.. మానవాళికి ముప్పు ఉందా?

రిమోట్ అలస్కాన్ ద్వీపం సమూహంలోని మూడు అగ్నిపర్వతాలు ఒకే సమయంలో విస్పోటనం చెందాయి. దాదాపు రెండు వారాల నుంచి ఈ విస్ఫోటనం కొనసాగుతోంది.

Volcanoes Erupt: ఒకేసారి బద్దలైన 3 అగ్నిపర్వతాలు.. మానవాళికి ముప్పు ఉందా?

Three Volcanoes Are Erupting Simultaneously On Alaskan Island Chain

Three Volcanoes Erupting on Alaskan island chain : అగ్నిపర్వతాలు విస్పోటనం చెందడం సర్వసాధారణం. అగ్నిపర్వతాలు పేలినప్పుడు పెద్దఎత్తునా లావా ఉప్పొంగుతుంటుంది. ఈ సమయంలో సమీపంలోని ప్రాంతాలు లావా వేడికి ఆహూతి అయిపోతుంటాయి. ఈ విస్పోటనం సమయంలో దాదాపు కొన్ని వందల మైళ్ల వరకు వేడి ఆవరిస్తుంది. దట్టమైన దుమ్ము, బూడిద కణాలు గాల్లోకి ఎగసిపడుతుంటాయి. ఇంతకీ.. ఈ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు మానవాళికి ముప్పు ఉంటుందా? అంటే.. అన్ని ప్రాంతాల అగ్నిపర్వతాలతో ముప్పు ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. కొన్ని అగ్నిపర్వతాలు మానవాళికి దూరంగా ఎక్కడో సముద్ర ద్వీపంలో ఉంటాయి.

అయితే ఇప్పుడు రిమోట్ అలస్కాన్ ద్వీపం సమూహంలోని మూడు అగ్నిపర్వతాలు ఒకే సమయంలో విస్పోటనం చెందాయి. దాదాపు రెండు వారాల నుంచి ఈ విస్ఫోటనం కొనసాగుతోంది. బేరింగ్ సముద్రం చుట్టూ ఉన్న 800 మైళ్ల విస్తీర్ణంలో అల్యూటియన్ ద్వీపం ఉంది. దీని కారణంగా ఈ విస్ఫోటనాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ సమీపంలోని మానవాళికి ముప్పు ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ విస్ఫోటనం దాదాపు రెండు వారాల క్రితమే ప్రారంభమైందని చెబుతున్నారు. అయినప్పటికీ మానవాళి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు.
Long cloud on Martian volcanoes : అంగారకుడి అగ్నిపర్వతాలపై వింత మంచు మేఘం గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు

అలాస్కా ద్వీపకల్పం చివరలో పావ్‌లోఫ్ (Pavlof Volcano) అనే అగ్నిపర్వతం ఉంది. ఇది సమీపంలోని ఏ జనాభాకైనా దగ్గరగా ఉంటుంది. ఈ అగ్నిపర్వతం తక్కువ స్థాయిలో బూడిదను విడుదల చేస్తుంటుంది. దాంతో ప్రమాద హెచ్చరిక స్థాయి ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్‌కు మార్చినట్టు అధికారులు చెబుతున్నారు. సమీపంలోని కోల్డ్ బే కమ్యూనిటీ (Cold Bay) ఈ అగ్నిపర్వతం నుంచి 35 మైళ్ల దూరంలో ఉంది.

మరో రెండు అగ్నిపర్వతాల్లో గ్రేట్ సిట్కిన్ అగ్నిపర్వతం (Great Sitkin Volcano), సెమిసోపోచ్నోయ్ అగ్నిపర్వతం (Semisopochnoi Volcano) వందల మైళ్ల దూరంలో ఉన్నాయి. ఆ తరువాతి అగ్నిపర్వతం జనావాసాలు లేని ద్వీపంలో దాదాపు 10వేల అడుగుల మేర గాలిలోకి బూడిదను చిమ్ముతోంది. గ్రేట్ సిట్కిన్ అగ్నిపర్వతం శిఖరం నుంచి లావా ఉప్పొంగుతోంది. ఈ విస్పోటన దృశ్యం సమీపంలోని అడక్ కమ్యూనిటీలోని ప్రజలకు కనిపిస్తుంది. గ్రేట్ సిట్కిన్ అగ్నిపర్వతంపై లావా ఫౌంటెన్ చాలా అసాధారణమైనదని అలాస్కా అగ్నిపర్వత అబ్జర్వేటరీ భూవిజ్ఞాన శాస్త్రవేత్త క్రిస్ వేథోమాస్ అన్నారు.

ఈ అగ్నిపర్వతం పేలుడు ఇలానే కొనసాగితే మాత్రం 27 మైళ్ల (43.45 కిలోమీటర్లు) దూరంలో ఉన్న అడక్ ప్రాంతాన్ని బూడిద కమ్మేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అగ్నిపర్వతాల పేలుడు పరిస్థితులను శాస్త్రవేత్తలు నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా.. అలస్కాన్ ద్వీపకల్ప తీరంలో శనివారం ఉదయం 6.9 భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

Asteroid Bennu: భారీ ఆస్టరాయిడ్ ‘బెన్ను’ భూమిని ఢీకొట్టే ఛాన్స్.. నాసా హెచ్చరిక!