Long cloud on Martian volcanoes : అంగారకుడి అగ్నిపర్వతాలపై వింత మంచు మేఘం గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు

ప్రతి ఏడాదిలో అంగారకుడి (మార్స్) అంగారకుడి ఉపరితలంపై ఒక వింత పొడుగైన మంచు మేఘం ఏర్పడుతుందంట. ఈ మంచు మేఘం వెనుక దాగిన అంతుచిక్కని రహాస్యాన్ని సైంటిస్టులు బయటపెట్టేశారు.

Long cloud on Martian volcanoes : అంగారకుడి అగ్నిపర్వతాలపై వింత మంచు మేఘం గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు

Long Cloud Form Martian Volcanoes

Long cloud form Martian volcanoes: ప్రతి ఏడాదిలో అంగారకుడి (మార్స్) అంగారకుడి ఉపరితలంపై ఒక వింత పొడుగైన మంచు మేఘం ఏర్పడుతుందంట. ఈ మంచు మేఘం వెనుక దాగిన అంతుచిక్కని రహాస్యాన్ని సైంటిస్టులు బయటపెట్టేశారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)తో అనుబంధంగా ఉన్న సైంటిస్టుల బృందం విచిత్రమైన మంచు మేఘం గుట్టును విప్పారు. మార్స్ ఎక్స్‌ప్రెస్ అంతరిక్ష నౌకలో విజువల్ మానిటరింగ్ కెమెరా (VMC) ఈ వింత మంచు మేఘాన్ని కాప్చర్ చేసింది. అంగారకుడి అగ్నిపర్వతాలపై కనిపించిన మేఘం 1,100-మైళ్ల పొడవు (1,800 కిమీ) వరకు ఉంటుందంట.

Cloud

ఆ అద్భుతమైన మేఘం సంబంధించి ఫోటోను సైంటిస్టులు విడుదల చేశారు. ఇంతకీ ఆ మేఘం అంగారకుడి ఉపరితలంపై ఎలా ఏర్పడుతుందో కనుగొన్నారు. వింత మంచు మేఘం ప్రతిరోజూ సుమారు 80 రోజులు లేదా ఒక మార్టిన్ సంవత్సరంలో అదృశమైపోతుంది. అంటే సుమారు 687 భూమి రోజుల వరకు ఉంటుంది. సౌర వ్యవస్థలో ఎత్తైన పర్వతం ఆర్సియా మోన్స్ అగ్నిపర్వతం నుంచి ఒలింపస్ మోన్స్ వరకు ఈ మేఘం విస్తరించి ఉంది. సాధారణంగా అగ్నిపర్వతాలు విస్పోటనం చెందుతుంటాయి. దాని ఫలితంగానే ఈ మేఘం ఏర్పడి ఉంటుందని అనుకోవచ్చు.

Clouds

కానీ, అంగారక గ్రహంపై అగ్నిపర్వతం భూమిపై మాదిరిగా లేదంటున్నారు. ఒకరకంగా ఈ మేఘానికి అగ్నిపర్వతాలు పరోక్షంగా కారణం కావొచ్చునని అభిప్రాయపడుతున్నారు. మార్స్ ఎక్స్‌ప్రెస్ ఆర్బిటర్‌ను నిర్వహించే ESA పరిశోధకులు క్లౌడ్‌లోని అస్థిరతను అర్థం చేసుకోవడానికి ‘మార్స్ వెబ్‌క్యామ్’ అనే మారుపేరుతో VMCని ఉపయోగించి రికార్డ్ చేశారు. వైకింగ్ 2 నుంచి వచ్చిన డేటా ప్రకారం పరిశీలిస్తే.. ఈ మేఘం 1970ల నాటిదిగా చెబుతున్నారు. చాలా కాలం క్రితమే మేఘం పాక్షికంగా ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు.

Cloudt

అదే మార్టిన్ క్లౌడ్ ‘ఓరోగ్రాఫిక్’ లేదా ‘లీ’ క్లౌడ్ అని తేలింది. అంటే.. అగ్ని పర్వతాలు వంటి ఉపరితలం ద్వారా వాతావరణంలోకి వచ్చినప్పుడు ఇలా మేఘంగా ఏర్పడుతుంది. సూర్యోదయానికి ముందు అగ్నిపర్వతంపై తేమ, గాలితో చల్లగా ఉన్న వాతావరణంలో ఘనీభవిస్తుంది. ప్రతి ఏడాది 80 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటుంది. సుమారు రెండున్నర గంటలు మాత్రమే ఈ మేఘం ఉంటుందంట. అదే భూమి ఉపరితలంపై కనిపించే ఓరోగ్రాఫిక్ మేఘాలు అంత పెద్ద ఎత్తుకు చేరుకోవు. స్పష్టమైన డైనమిక్స్‌ను చూపించవని బాస్క్ కంట్రీ యూనివర్శిటీ అగస్టిన్ సాంచెజ్-లావెగా పేర్కొన్నారు. ఈ మేఘాలు భూమిపై ఎలా భారీ స్థాయిలో ఏర్పడతాయో అదే విధంగా ఉంటాయన్నారు.