HAVISH : హ్యాపీ బర్త్‌డే హ్యాండ్సమ్ హీరో హవీష్..

డిఫరెంట్ క్యారెక్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించే హవీష్.. ప్రస్తుతం కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు..

HAVISH : హ్యాపీ బర్త్‌డే హ్యాండ్సమ్ హీరో హవీష్..

Havish

HAVISH: ‘నువ్విలా’, ‘జీనియస్’, ‘సెవెన్ -7’ సినిమాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న యంగ్ హీర్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ హవీష్, శుక్రవారం (జూన్ 25) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించే హవీష్.. ప్రస్తుతం కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

కోవిడ్ కారణంగా గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో.. నేటి యువతారాన్ని మెప్పించే యాక్షన్, ప్రేమ కథలతో సిద్ధంగా సినిమాలు చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.. అన్నీ కుదిరితే ఆగస్టు నెలలో కొత్త సినిమాలను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Havish

అలాగే.. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ‘రాక్షసుడు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హవీష్, అగ్ర కథానాయకులతో మరో 2, 3 సినిమాలు నిర్మించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఇండస్ట్రీ టాక్.. హీరోగా, నిర్మాతగా మంచి విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నారు బర్త్‌డే బాయ్ హవీష్..