Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయ స్పెషల్.. రూ.1కే బంగారం కొనండి.. టాప్ యాప్స్ ఫీచర్లు, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్..!
Akshaya Tritiya 2026 : మీ ఇంట్లోనే ఉండి అక్షయ తృతీయ 2026 నాడు కేవలం రూ. 1కే డిజిటల్ గోల్డ్ కొనేసుకోండి. ఈ యాప్స్ ద్వారా ఈజీగా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు.. పూర్తి వివరాలివే..
Akshaya Tritiya 2026 Digital Gold ( Image Credit : AI )
- ఏప్రిల్ 19న అక్షయ తృతీయ 2026 వస్తోంది
- డిజిటల్ గోల్డ్ కొనేందుకు ఇదే అద్భుతమైన ఛాన్స్
- డిజిటల్ గోల్డ్ కొని ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసా?
- ఈ ఆన్ లైన్ యాప్స్ ద్వారా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం ఈజీ
Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయ రోజున బంగారం కొనేందుకు చూస్తున్నారా? ఈ ఏడాదిలో అక్షయ తృతీయ ఏప్రిల్ 19న వస్తుంది. అంటే.. ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్షయ తృతీయ నాడు డిజిటల్ గోల్డ్ ఎలా కొనాలో తెలుసా? ఇప్పుడే ప్లాన్ చేయండి. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో అద్భుతమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనడం శుభప్రదమని చాలా మంది భావిస్తారు. ప్రతి సంవత్సరం (Akshaya Tritiya 2026) ఈ పండుగ సందర్భంగా నగల దుకాణాలు కిక్కిరిసి పోతుంటాయి. అయితే, ఇప్పుడు చాలా మంది డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. డిజిటల్ గోల్డ్ ద్వారా మీరు నగల షాపుకు వెళ్లకుండా లేదా ఎక్కడ భద్రంగా దాచిపెట్టాలనే ఆందోళన అవసరం ఉండదు.
చాలా సింపుల్ గా ఆన్లైన్లో స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. మీరు మీ ఫోన్ నుంచే కేవలం చాలా సింపుల్ గా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మీరు కేవలం రూ. 1కే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్ ఉన్నవారికి కూడా అద్భుతమైన పెట్టుబడి ఆప్షన్.
ఈ అక్షయ తృతీయ నాడు మీరు డిజిటల్ గోల్డ్ పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే ఏ ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌లు చాలా సేఫ్. ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట.. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
గ్రోవ్ :
సురక్షితమైన మార్గంలో బంగారంలో (Akshaya Tritiya 2026) పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు గ్రోవ్ అద్భుతమైన యాప్. ఈ యాప్ గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల వంటి అనేక బంగారు పెట్టుబడి ఆప్షన్లను అందిస్తుంది.
మార్కెట్ ట్రేడింగ్‌తో పరిచయం ఉన్నవారి కోసం, MCX గోల్డ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ను ట్రేడ్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇవన్నీ సెబీ ద్వారా కంట్రోల్ అవుతాయి. అందుకే పెట్టుబడిదారులకు అదనపు ప్రొటెక్షన్ అందిస్తుంది.
పేటీఎం :
రెగ్యులర్ బంగారంలో కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు పేటీఎం అదిరిపోయే ఆప్షన్. ఈ ప్లాట్‌ఫారమ్ MMTC-PAMP, ఆగ్మాంట్ వంటి రిఫైనర్లతో కలిసి రన్ అవుతుంది. తద్వారా గోల్డ్ స్వచ్ఛత, సరసమైన ధరకే అందిస్తోంది.
మీరు కొనుగోలు చేసిన బంగారం సేఫ్ వాల్ట్‌లో స్టోర్ అవుతుంది. ఇంట్లో బంగారం మాదిరిగా ఆందోళన అవసరం ఉండదు. మీకు అవసరమైనప్పుడు మీ బంగారాన్ని అమ్ముకోవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీరు స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు గోల్డ్ గిఫ్ట్ గా కూడా ఇవ్వొచ్చు.
ఫోన్‌పే :
ఫోన్‌పే కూడా బెస్ట్ ఆప్షన్. మీరు చిన్న మొత్తంతో డిజిటల్ గోల్డ్ పెట్టుబడి పెట్టండి. కాలక్రమేణా మీ సేవింగ్స్ పెంచుకోవచ్చు. ఈ గోల్డ్ ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సేఫ్ లాకర్లో స్టోర్ అవుతుంది. ఫిజికల్ గోల్డ్ అవసరం ఉండదు.
ఫోన్‌పే డిజిటల్ గోల్డ్ ఫిజికల్ బంగారంగా మార్చుకునే అవకాశం ఉంది. అలాగే, మీరు క్రమం తప్పకుండా ఒక స్థిరమైన మొత్తాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన ఫీచర్ కూడా ఉంది.
గూగుల్ పే :
ఎలాంటి అదనపు ప్రాసెస్ అవసరం లేదు. బంగారంలో సేవింగ్ చేయాలనుకునే వారికి గూగుల్ పే అద్భుతమైన ఆప్షన్. గూగుల్ పే కేవలం ఒక్క ట్యాప్‌తో బంగారాన్ని కొనొచ్చు లేదంటే అమ్మేయొచ్చు. ఈ యాప్ బంగారం ధర అలర్ట్ కూడా అందిస్తుంది. సరైన సమయంలో బంగారం కొనడం లేదా అమ్మేందుకు బెస్ట్ యాప్.
బజాజ్ ఫిన్సర్వ్ :
బజాజ్ ఫిన్సర్వ్ అద్భుతమైన ఆప్షన్. సొంత డబ్బుతో లేదా గ్రాములలో బరువును ఎంచుకుని డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో గోల్డ్ సిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టొచ్చు. కొనుగోలు చేసిన బంగారం అంతా సేఫ్ వాల్ట్‌లో స్టోర్ అవుతుంది. బంగారం నిల్వకు సంబంధించిన ఆందోళన అవసరం లేదు.
