Uttar Pradesh: నిద్రిస్తుండగా టేబుల్ ఫ్యాన్ మీద పడి ప్రాణాలు కోల్పోయిన తల్లీకూతురు
నిద్రిస్తుండగా టేబుల్ ఫ్యాన్ మీద పడి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహరాజ్ గంజ్ పరిధిలో జరిగింది. నిషా చౌదరీ(35), ఆమె కూతురు కరిష్మా(14) మధ్యాహ్న సమయంలో వాళ్ల ఇంట్లోనే పడుకుని ఉన్నారు.

unknown dead body
Uttar Pradesh: నిద్రిస్తుండగా టేబుల్ ఫ్యాన్ మీద పడి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహరాజ్ గంజ్ పరిధిలో జరిగింది. నిషా చౌదరీ(35), ఆమె కూతురు కరిష్మా(14) మధ్యాహ్న సమయంలో వాళ్ల ఇంట్లోనే పడుకుని ఉన్నారు. అప్పటి వరకూ తిరుగుతున్న ఫ్యాన్ యాక్సిడెంటల్ గా పడిపోయింది.
నిద్రమత్తులో జరిగిన హఠాత్పరిణామానికి ఎలా స్పందించాలో తెలియక కరెంట్ వైర్ పట్టుకున్నారు. దాంతో పాటు కరెంట్ షాక్ తగలడంతో ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు మహరాజ్ గంజ్ ఎస్పీ కౌస్తుబ్ వెల్లడించారు.
బ్రిజ్మన్‌గంజ్ పరిధిలోని ధని గ్రామంలో బాధిత కుటుంబం నివాసముంటుండగా.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. ఘటనాస్థలానికి వచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు.
Read Also : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ‘పుష్ప’ సాంగ్స్ హవా..