Sex Reassignment Surgery: లింగమార్పిడి సర్జరీలపై మహిళా కమిషన్ నోటీసులు

ప్రభుత్వాసుపత్రుల్లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలపై ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖను కోరింది. ఈ సదుపాయం లేకపోవడం వల్ల ట్రాన్స్‌జెండర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

Sex Reassignment Surgery: లింగమార్పిడి సర్జరీలపై మహిళా కమిషన్ నోటీసులు

Sex Reassignment Surgery

Sex Reassignment Surgery: లింగ మార్పిడి సర్జరీలపై ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. లింగ మార్పిడి సర్జరీలకు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవని, ఈ ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరింది. లింగ మార్పిడితోపాటు అనేక సమస్యలపై ట్రాన్స్‌జెండర్లతో ఢిల్లీ మహిళా కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంటుంది. వాళ్లు ఎదుర్కొనే అనేక సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుంది.

Rajasthan: అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడి

ఈ సందర్భంగా లింగ మార్పిడి చికిత్సలు చేయించుకునే విషయంలో ట్రాన్స్‌జెండర్లు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు మహిళా కమిషన్ గుర్తించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ చికిత్సలకు సంబంధించి ఏర్పాట్లు సరిగ్గా లేవని, ఆస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే, ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు జరగడం లేదని, దీనికి సంబంధించిన సదుపాయాలు కూడా లేవని వైద్య ఆరోగ్య శాఖ బదులిచ్చింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సర్జరీలకు ఏర్పాట్లు చేయాలని మహిళా కమిషన్ ఆదేశించింది. కాగా, ఈ సర్జరీలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు, వాటి అమలుకు సంబంధించిన సూచనలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

Madhya Pradesh: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది మృతి

తాజాగా ఈ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో దానికి సంబంధించిన వివరాల్ని తెలపాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఢిల్లీలోని ప్రభుత్వాసుపత్రుల్లో లింగ మార్పిడి సర్జరీలు లేకపోవడం వల్ల ఇక్కడి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఇది చాలా ఖరీదైంది కావడంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత లింగమార్పిడి సర్జరీలు జరిగేలా చూసే ఉద్దేశంతో నోటీసులు అందించాం’’ అని స్వాతి మాలివాల్ తెలిపారు.