Vivek Agnihotri : ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ‘వై’ కేటగిరి భద్రత

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా రిలీజ్ అయ్యాక దేశ వ్యాప్తంగా సినిమాపై అభినందనల వర్షం కురుస్తుంది. అయితే ఈ సినిమాలో పాకిస్థాన్, ఉగ్రవాదులు కశ్మీర్ లోని హిందువులని ఎంత దారుణంగా...........

Vivek Agnihotri : ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ‘వై’ కేటగిరి భద్రత

Vivek Agnihotri

Updated On : March 19, 2022 / 7:38 AM IST

 

The Kashmir Files :  ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేవలం మౌత్ టాక్ తోనే భారీ విజయం సాధించి వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది ఈ సినిమా. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ దాదాపు నాలుగేళ్లపాటు రీసెర్చ్ చేసి ఎంతో శ్రమించి తెరకెక్కించారు.

Abhishek Agarwal : ‘ది కశ్మీర్ ఫైల్స్’ త్వరలోనే తెలుగు డబ్బింగ్.. 10 టీవీతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పెషల్ ఇంటర్వ్యూ..

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా రిలీజ్ అయ్యాక దేశ వ్యాప్తంగా సినిమాపై అభినందనల వర్షం కురుస్తుంది. అయితే ఈ సినిమాలో పాకిస్థాన్, ఉగ్రవాదులు కశ్మీర్ లోని హిందువులని ఎంత దారుణంగా చంపేశారో చూపించారు. అయితే దీనిపై ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. డైరెక్టర్ ని, చిత్ర యూనిట్ ని బెదిరింపులకు గురిచేస్తుంది. దీంతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ప్రమాద సూచికలు ఉన్నాయంటూ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో కేంద్ర ప్రభుత్వం వివేక్‌ అగ్నిహోత్రికి ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తున్నారు.