Abhishek Agarwal : ‘ది కశ్మీర్ ఫైల్స్’ త్వరలోనే తెలుగు డబ్బింగ్.. 10 టీవీతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పెషల్ ఇంటర్వ్యూ..

10 టీవీతో అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ''ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సినిమా విడుదలకు ముందు..

Abhishek Agarwal : ‘ది కశ్మీర్ ఫైల్స్’ త్వరలోనే తెలుగు డబ్బింగ్.. 10 టీవీతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పెషల్ ఇంటర్వ్యూ..

Abhishek Agarwal

 

The Kashmir Files :  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా రోజు రోజుకి మరింత విస్తరిస్తుంది. కేవలం మౌత్ టాక్ తోనే భారీ విజయం సాధించి వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది ఈ సినిమా. సినిమా చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాణంలో భాగమైన తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10 టీవీతో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

10 టీవీతో అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ”ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సినిమా విడుదలకు ముందు, తర్వాత చాలా మంది తమ భావాలని వ్యక్తపరిచారు. 32 ఏళ్ళ నుంచి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు అంటూ చాలా మంది కన్నీళ్లు పెట్టారు. సినిమా చూసిన ప్రతి కశ్మీర్ పండిట్ థ్యాంక్ యూ సార్ అని చెప్తున్నారు. సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి, కశ్మీర్ గురించి, కశ్మీర్ హిందువుల గురించి చాలా రీసెర్చ్ చేశాం. కశ్మీర్ పండితులకు ఈ సినిమా అంకితం చేస్తున్నాం.”

Sandeepa Dhar : ట్రక్కుల్లో దాక్కొని కశ్మీర్ నుంచి వచ్చేశాం.. కశ్మీర్ ఫైల్స్ చూసి బాలీవుడ్ హీరోయిన్ వ్యాఖ్యలు..

”ప్రధాని నరేంద్రమోదీ ఆఫీసునుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. సినిమా తర్వాత ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధపడ్డాం. సినిమా తీసేటప్పుడే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించాం. అందుకే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో దేశంలో అన్ని భాషల్లోకి డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం.”

The Kashmir Files : తెలంగాణలో కూడా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ మూవీని టాక్స్ ఫ్రీ చేయాలి.. రాజాసింగ్ కామెంట్స్..

”ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకి అస్సాం, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతో సహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు చాలా ఫీల్ అయి చేశారు. త్వరలోనే డైరెక్టర్ వివేక్ తో మరో సినిమా చేయబోతున్నాం.” అని తెలిపారు.