#FliporFoldchallenge: సామ్‌సంగ్ కోసం యోహాని ఫ్లిప్ ఆర్ ఫోల్డ్ ఛాలెంజ్!

ఈ మధ్య కాలంలో టిక్‌టాక్.. యూట్యూబ్ షార్ట్స్.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఇలా ఎక్కడ చూసినా ఈ అమ్మాయి పాటే. హస్కీ వాయిస్‌తో వినేకొద్ది వినాలనిపించేలా ఆమె పాడిన పాట.. ఖండాలను సైతం,,

#FliporFoldchallenge: సామ్‌సంగ్ కోసం యోహాని ఫ్లిప్ ఆర్ ఫోల్డ్ ఛాలెంజ్!

#fliporfoldchallenge

Updated On : October 18, 2021 / 7:01 PM IST

#FliporFoldchallenge: ఈ మధ్య కాలంలో టిక్‌టాక్.. యూట్యూబ్ షార్ట్స్.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఇలా ఎక్కడ చూసినా ఈ అమ్మాయి పాటే. హస్కీ వాయిస్‌తో వినేకొద్ది వినాలనిపించేలా ఆమె పాడిన పాట.. ఖండాలను సైతం దాటేసి, సంగీతానికి సరిహద్దులు ఉండవని నిరూపించింది. ‘మణికే మాగే హితే’ అంటూ సాగే ఈ పాటలోని భావం ఎవరికీ అర్థం కాకపోయినా.. ఆమె గాత్రంలోని మాధూర్యం మాత్రం ప్రతి ఒక్కరినీ కట్టిపడేసి బాషలతో సంబంధం లేకుండా.. ప్రపంచాన్ని చుట్టేసింది. అప్పటి వరకు శ్రీలంకకు పరిమితమైన ఆమె స్టార్ స్టేటస్ హద్దులు దాటేసింది.

Ketika Sharma: రామ్‌తో ఛాన్స్.. కేతికకు మంచి రోజులొచ్చాయా?

దీంతో ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా తమ వ్యాపార ప్రకటనల కోసం కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సామ్ సంగ్ ఆమెను తమ జెడ్ సిరీస్ ప్రీమియం ఫోన్ల బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఇప్పటికే ఆ సిరీస్ ఫోన్లకు సంబంధించి ఆమెతో ప్రటనకు కూడా విడుదల చేయగా తాజాగా ఆమెతో ఫ్లిప్ ఆర్ ఫోల్డ్ ఛాలెంజ్ పేరుతో ఒక కాంటెస్ట్ కూడా విడుదల చేసింది. యోహానితో ఓ వీడియో రూపొందించిన సామ్ సంగ్ ఆమె అధికారిక ఖాతాలతో పాటు సామ్ సంగ్ సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ వీడియో విడుదల చేశారు.

Shriya Saran: పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదేలే!

ఈ వీడియోలోని సౌండ్‌ట్రాక్ ఉపయోగించి ఎవరైనా వీడియోను రూపొందించి Samsung #FliporFoldchallengeలో పాల్గొనవచ్చని ఈ ఖాతాలలో ప్రకటించగా వీడియోను @Samsungsrilankaofficialలో కానీ TikTok, @samsungSrilanka Instagramలో #FlipitFoldit #GalaxyZFold3 #GalaxyZFlip3 హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి పోస్ట్ చేయాలని తెలిపారు. క్యాప్షన్‌లో Samsung Sri Lankaను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం యోహాని ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భారీ స్థాయిలో స్పందన వస్తుందని సామ్ సంగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Yohani (@yohanimusic)