Zika Virus : తెలంగాణలో జికా వైరస్ టెన్షన్.. అసలే వర్షాకాలం జర భద్రం!

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో జికా వైరస్ టెన్షన్ పుట్టిస్తోంది.

Zika Virus : తెలంగాణలో జికా వైరస్ టెన్షన్.. అసలే వర్షాకాలం జర భద్రం!

Zika Virus Infection Zika Virus Spreads Slowly In States, One Sample Found In Telangana

Zika Virus Infection : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో జికా వైరస్ టెన్షన్ పుట్టిస్తోంది. దేశంలో జికా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జికా వైరస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఐసీఎంఆర్, పుణేలోని ఎన్‌ఐవీ నిర్వహించిన అధ్యయనంలో జికా వైరస్ తెలంగాణతో సహా పలు రాష్ట్రాలకు వ్యాపించిందని వెల్లడించింది. భారత్‌లో అనేక రాష్ట్రాలకు జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని అధ్యయనం పేర్కొంది. వైరస్ వ్యాప్తిపై నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. ఈ అధ్యయనంలో భాగంగా 1,475 శాంపిల్స్ పరీక్షించగా.. 64 శాంపిల్స్ జికా వైరస్ పాజిటివ్‌గా తేలాయి. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన శాంపిల్ కూడా ఉంది. దేశంలోని ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం తెలిపింది.

జీకావైరస్‌ను గుర్తించడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్, ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ BR Shamanna అధ్యయనంలో తేలిందని అన్నారు. జీకా వైరస్ అంటే ఏంటో పెద్దగా చాలామందికి తెలియదన్నారు. జీకా వైరస్‌పై అవగాహన ఇప్పుడిప్పుడే ప్రజల్లో పెరుగుతోందని చెప్పారు. వర్షాకాలంలో డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమిస్తాయని, అలాగే జికా వైరస్ కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. 2017 నుంచి 20121 వరకు జికా వైరస్ దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గుర్తించారు. గతంలో గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే జికా వైరస్ వ్యాప్తి చెందింది.

ప్రతి ఏడాదిలో కొత్త రాష్ట్రాలకు జికా వైరస్ వ్యాపిస్తోంది. పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. ఐసీఎంఆర్‌, నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన అధ్యయనంలో జికా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని వెల్లడించింది. దోమలద్వారా వ్యాపించే జీకా వైరస్ కారణంగా జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Read Also : New Zika Virus : కాన్పూర్‌లో 100 మార్క్ దాటిన జికా వైరస్.. కొత్తగా మరో 16 కేసులు!