Heart Disease : గుండె జబ్బులకు ఇలాంటి ఆహారాలే ప్రధాన కారణమా?

ఆల్కహాల్ ను మితిమీరి తాగడం, సిగరేట్లను ఎక్కువగా కాల్చడం వల్ల కాలెయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయన్న సంగతి చాలా మందికి తెలుసు. నిజానికి వీటివల్ల ఈ అవయవాలకే కాదు గుండెకు కూడా మంచిది కాదు.

Heart Disease : గుండె జబ్బులకు ఇలాంటి ఆహారాలే ప్రధాన కారణమా?

Are these foods the main cause of heart disease_

Heart Disease : ఒకప్పుడు ఈ గుండె జబ్బులు మధ్యవయస్సులకు, వయసు పైపడిన వారికి మాత్రమే వచ్చేవి. అయితే ఇప్పుడు గుండె జబ్బుల బారిన పడుతున్న వారి జాబితాలో యువత కూడా ఉంది. ఎంతో మంది గుండెపోటుతో చనిపోవటం ఆందోళన రేకెత్తిస్తుంది. అయితే దీనికి మనం తీసుకునే ఆహారాలు, జీవనశైలి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను, పానీయాలను మోతాదుకు మించి తీసుకోవటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్‌ శరీరంలో హార్మోన్లు, విటమిన్లు, కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఇది సహాయపడుతుంది. కానీ దీని స్థాయిలు అధికమైతే ప్రమాదం. చెడు కొవ్వు పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం పెరుగుతుంది.

మన డైట్‌లో ఆరోగ్యకరమైన, పోషక ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల గుండెకు హాని చేసే కొవ్వులను తగ్గించుకోవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే సంతృప్త కొవ్వును అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రై చేసిన ఆహార పదార్థాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. వేయించిన ఆహారంలో క్యాలరీలు, ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్ ఆరోగ్యానికి మంచిది కాదు. వేయించిన ఆహారం ఎక్కువగా తింటే.. గుండె జబ్బులు, ఊబకాయం, డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది.

ప్రాసెస్ మాంసాహారాలు, ఐస్ క్రీంలు వద్దు ; లడ్డూలు, కుకీలు, కేకులు, ఐస్ క్రీం వంటి వాటిలో సంతృప్త కొవ్వు, షుగర్‌, శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఉంటాయి. శరీరంలో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కుకీలు, కేకులు, ఐస్ క్రీంలో శరీరానికి అవసమైన విటమిన్లు, మినరల్స్‌, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండవు. కేకులు, ఐస్ క్రీమ్‌లు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యమైన దెబ్బతింటుంది. బరువు పెరుగుతారు. ప్రాసెస్ చేసిన మాంసాలలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే.. గుండె సమస్యలు, పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. ప్రాసెస్ చేసిన మాంసంలో పోషకాహారం తక్కువగా ఉంటుంది, ఉప్పు కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. చికెన్ వంటి మాంసాహారాలను తీసుకోవచ్చు.

చెడు అలవాట్లు మానుకోవటం ; ఆల్కహాల్ ను మితిమీరి తాగడం, సిగరేట్లను ఎక్కువగా కాల్చడం వల్ల కాలెయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయన్న సంగతి చాలా మందికి తెలుసు. నిజానికి వీటివల్ల ఈ అవయవాలకే కాదు గుండెకు కూడా మంచిది కాదు. ఈ అలవాట్ల వల్ల హార్ట్ ఫెయిల్యూర్, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ చెడ్డ అలవాట్లను వీలైనంత తొందరగా విడిచిపెట్టాలి.

బేకరీ ఫుడ్స్ కు దూరంగా ; బేకరీ ఫుడ్‌లో కొలెస్ట్రాల్‌, వెన్న, చక్కెర అధికంగా ఉంటాయి. వీటిలో చెడు కొలెస్ట్రాల్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్త నాళాలలో కొలెస్ట్రాల్, కొవ్వు, కాల్షియం పేరుకుపోయేలా చేస్తుంది. అవయవాలకు రక్త ప్రవాహం జరగకుండా అడ్డుకుంటుంది. అందుకే బేకరీ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది. జంక్‌‌ ఫుడ్‌ ఎక్కువగా తింటే.. డయాబెటిస్‌, గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జంక్ ఫుడ్ తినేవారిలో కొలెస్ట్రాల్‌, బెల్లీ ఫ్యాట్‌, కడుపు ఊబ్బరం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.