Vaccinations for young children : చిన్న పిల్లలకు వేసే టీకాల విషయంలో పెద్దలకు అవగాహన తప్పనిసరా?

హ్యుమన్ పాలిలోమా వైరస్ తో గర్భాశయ క్యాన్సర్ లు వస్తాయి. మగవాళ్లకి వార్డ్స్ వస్తుంటాయి. హ్యుమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ తో వీటిని అరికట్టవచ్చు.

Vaccinations for young children : చిన్న పిల్లలకు వేసే టీకాల విషయంలో పెద్దలకు అవగాహన తప్పనిసరా?

Recommended Solutions to the Barriers to Immunization in

Vaccinations for young children : సాధారణంగా టీకాలు చిన్న వయస్సు వారి నుండి పెద్ద వయస్సు వారి వరకు అందరికి వేస్తారు. అయితే పుట్టిన తరువాత పిల్లలకు కాలానుగుణంగా వివిధ వ్యాధులు సంక్రమించే ప్రమాదం పొంచి ఉన్న నేపధ్యంలో ముందస్తుగా అవి దరిచేరకుండా టీకాలు ఇస్తుంటారు. ధనుర్వాతం, న్యుమోనియా, ఫ్లూ హెపటైటిస్, సర్ వైకల్ కాన్సర్, జోస్టర్ లకు టీకాలు వేస్తారు. అసలు ఏయే వ్యాధులు రాకుండా టీకాలు వేస్తారు. వాటి వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ధనుర్వాతానికి టీకా ; ధనుర్వాతం రాకుండా టెట్నస్ టీకాలు వేస్తారు. టెట్నస్ జబ్బులో క్రింద దవడ పట్టుకుపోతుంది. క్లోస్ప్రిడియం టెటానీ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రశేవించిన సందర్భంలో ధనుర్వాతం వస్తుంది. ఈ గాయం ద్వారా టెటెనోస్పాస్మిన్ అనే విష పదార్ధాన్ని శరీరంలోకి ఉత్పత్తి చేయటం వల్ల టెట్నస్ వస్తుంది ఈ విషపదార్ధం నరాలపై ప్రభువం చూపుతుంది. దీంతో నరాల నుండి వెన్ను, మెదడుకి సిగ్నలింగ్ వ్యవస్ధ దెబ్బతింటుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల దీనిని రాకుండా చూసుకోవచ్చు.

న్యూమోకోకల్ వ్యాక్సిన్ ; పిసిబి 13 అనే వ్యాక్సిన్ ని 5 సంవత్సరాల లోపు వాళ్లకి , 19 సంవత్సరాలు పైబడిన వాళ్లకి లక్షణాలను బట్టి దీనిని ఇవ్వాల్సి ఉంటుంది. 65 సంవత్సరాలకు పై బడిన వారికి పిపివిఎస్ వి 23 వ్యాక్సిన్ ని వేయించాలి. సికిల్ సెల్ డిసీజ్, హెచ్ ఐవి, క్యాన్సర్ తో బాధపడేవాళ్లకి, సిగరెట్టు ఎక్కవగా తాగే వాళ్లకి , ఆస్మా, డయాబెటిస్, క్రానిక్ లంగ్, కిడ్నీ వ్యాధులు ఉన్న వారికి రిస్క్ ఎక్కవగా ఉంటుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది.

మెనింజోకోకిల్ వ్యాక్సిన్ ; దీనినే బ్రెయిన్ ఫీవర్ వ్యాక్సిన్ అంటారు. మెనింజైటిస్, మెనిరిగో కోక్ సేమియా, సెఫ్టిసీమియా, నెఫ్టిక్, అర్ధరైటిస్, నిమోనియో లాంటివి తగ్గించటానికి ఈ వ్యాక్సిన్ తోడ్పడుతుంది.

వ్యారిసెల్లా వ్యాక్సిన్ ; చికెన్ పాక్స్ రాకుండా ఈ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. రూబెల్లా వ్యాక్సిన్, మీజిల్స్, మమ్స్ కి , పొంగు , తట్టులాంటి వాటి నుండి రక్షించటానికి ఈ వ్యాక్సిన్ సహాయపడుతుంది.

జ్యోష్టర్ వ్యాక్సిన్ ; హెర్పిస్ తగ్గటానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగిస్తారు. పోస్టర్ పెటిక్ న్యూరాజియా తీవ్రతని , నొప్పిని అసౌకర్యాన్ని తగ్గించటానికి జ్యోష్టర్ వ్యాక్సిన్ ఉపకరిస్తుంది.

గర్భాశయ క్యాన్సర్ ; హ్యుమన్ పాలిలోమా వైరస్ తో గర్భాశయ క్యాన్సర్ లు వస్తాయి. మగవాళ్లకి వార్డ్స్ వస్తుంటాయి. హ్యుమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ తో వీటిని అరికట్టవచ్చు.

హెపటైటిస్ ; హెపటైటిస్ ఎ, బి, సి,డి అనేవి వేరు వేరు అయినప్పటికీ వ్యాధి ఒక్కటే. లివర్ ఇన్ ఫ్లమేషన్ తో జాండీస్ తో హెపటైటిస్ ని గుర్తించవచ్చు. హెపటైటిస్ సి, డి, ఈలకు వ్యాక్సిన్ లేనప్పటికీ, ఎ, బిలు రాకుండా వ్యాక్సన్ ఉంది.

ఫ్లూ వ్యాక్సిన్ ; కొన్ని కాలాల్లో ఫ్లూ అధికంగా వస్తుంది. ఈ సందర్భంలో ఫ్లూకు వ్యాక్సిన్ చేయించటం మంచిది. ఈ వ్యాక్సిన్ తోపాటుగా , యాంటీ బయాటిక్స్ ను వాడుకోవాలి. దీనికి ఎక్కవ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.