Pizzas : పిజ్జాలు, చిప్స్ తింటున్నారా… అయితే మతిమరుపు వ్యాధి ఖాయం

ప్రాసెస్ట్ ఫుడ్స్ తినటం వల్ల బరువు పెరగటం, షుగర్ రావం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసు అయితే తాజా పరిశోధనలు అందరిని షాక్ గురిచేస్తున్నాయి.

Pizzas : పిజ్జాలు, చిప్స్ తింటున్నారా… అయితే మతిమరుపు వ్యాధి ఖాయం

Pizza (1)

Pizzas : పిజ్జాలు, చిప్స్, వంటి ఫాస్ట్ ఫుడ్స్ తినేవారు ఇక పై వాటిని తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే తాజా పరిశోధనల్లో వీటిని తినటం వల్ల మెదడు పనితీరు మందగించటంతోపాటు జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని తేలింది. ప్రాసెస్ట్ ఫుడ్స్ తినటం వల్ల బరువు పెరగటం, షుగర్ రావం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసు అయితే తాజా పరిశోధనలు అందరిని షాక్ గురిచేస్తున్నాయి.

బ్రెయిన్ , బిహేవియర్, ఇమ్యూనిటీ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో హెల్తీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే నిల్వ పదార్ధాలు, కొవ్వుఅధికంగా కలిగిన పదార్ధాలు, ఆర్టిఫిషియల్ రంగు కలిగిన పదార్ధాలు, ఫ్లేవర్ ఉండే పదార్ధాలు తీసుకుంటే మెమొరీ లాస్ అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలు, ఇతర జంక్స్ ఫుడ్స్ అనారోగ్యకరమైన పదార్ధాలతో తయారు చేయబడతాయి. వీటిలో అధిక శుద్ధి చేసిన పిండి, భారీగా ప్రాసెస్ చేయబడిన మాంసం ఉంటాయి. పిజ్జాలో కూడా కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది. ఆతరహా ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మెదడు పనితీరు మందగించినట్లు స్పష్టమైంది. ప్రాసెస్ ఆహారాన్ని తీసుకున్న వృద్ధుల్లో అల్జీమర్స్ , ఉన్నట్లుండి అన్నీ మర్చిపోవటం కనుగొన్నట్లు ఒహియో స్టేట్ యూనివర్శిటీ సీనియర్ పరిశోధకులు రూత్ బారింటోస్ తెలిపారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మితంగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.