Peanuts : పల్లీలు తింటే బరువు పెరుగుతారా?…

ఐరన్ రక్తహీనత సమస్యకు చెక్ చెప్పవచ్చు. ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఒక గ్లాసు పాలకు సమానమైన ప్రొటీన్స్ పల్లీలలో దొరుకుతాయి. పల్లీల్లో బి కేటగిరీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

Peanuts : పల్లీలు తింటే బరువు పెరుగుతారా?…

Peanuts

Peanuts : వేరు శనగ గింజలు. వీటినే పల్లీలు అని పిలుస్తారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాలక్షేపానికి చాలా మంది పల్లీ గింజలను నోట్లో వేసుకుని నములు తుంటారు. అయితే వీటితో పప్పుచక్క, పప్పుండలు, చట్నీలు వివిధ రకాల వంటల్లో వీటిని వినియోగిస్తారు. అయితే చాలా మంది వంటల్లో పల్లీలను వాడితే తినేందుకు ఇష్టపడరు. మరికొందరిలో పల్లీలు తింటే బరువు పెరిగిపోతామన్న భయం కూడా ఉంటుంది. అందుకే వీటి జోలికి వెళ్ళరు. చాలా మందికి తెలియని విషయం ఏటంటే వేరు శనగ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి.

పల్లీలలో విటమిన్లు, ఖనిజాలు, పోషక విలువలతో పాటు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు నరాల జబ్బులు, వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. ఉదర సంబంధ వ్యాధులు, పేగు క్యాన్సర్ వంటి జబ్బులకు మంచి ఔషదంగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే మోనో శాచురేటెడ్‌ ఫ్యాట్స్, ఓలిక్‌ యాసిడ్‌ గుండెజబ్బుల్ని రాకుండా అడ్డుకుంటాయి. అమినో యాసిడ్స్ అందించి శరీరంలో పేరుకుపోయిన చెడుకొవ్వు తొలగిపోయేలా చేస్తాయి. వీటిని తింటే బరువు పెరుగుతామన్నది అపోహమాత్రమే…నిర్ణీత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. పల్లీల్లోని పోలీఫినోనిక్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ జీర్ణాశయ క్యాన్సర్లు దరిచేరనియ్యవు.
పల్లీల్లోని

ఐరన్ రక్తహీనత సమస్యకు చెక్ చెప్పవచ్చు. ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఒక గ్లాసు పాలకు సమానమైన ప్రొటీన్స్ పల్లీలలో దొరుకుతాయి. పల్లీల్లో బి కేటగిరీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పోటాషియం, మెగ్నీషియం, కాపర్‌, కాల్సియం, ఐరన్‌, సెలీనియమ్‌, జింక్‌ వంటి ఖనిజాలకు నెలవుగా పల్లీలను చెప్పవచ్చు. చర్మకాంతికి, జుట్టు నిగనిగలాడేందుకు తోడ్పడుతాయి. రోజూ భోజనం చేసిన తర్వాత గుప్పెడు ఉడకబెట్టిన పల్లీలు తింటే జీర్ణశక్తిని పెంచి, రక్త హీనతను తగ్గుతుంది. గర్భిణీలు తమ డైట్ లో పల్లీలు చేర్చుకుంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

పల్లీల్లోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో లభించే నైట్రిక్‌ ఆక్సైడ్‌ గుండెపోటును రాకుండా కాపాడుతుంది. మూత్రకోశ వ్యాధులు వచ్చే అవకాశం  తగ్గుతాయని పరిశోధనలు చెప్తున్నాయి. షుగర్‌లెవెల్స్‌ను చక్కదిద్దడంలో వేరుశనగ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సెరటోనిన్‌ షుగర్ లెవల్స్‌ ను అదుపులో ఉంచి డిప్రెషన్ దరిచేరనివ్వకుండా చూస్తుంది. శరీరంలోని మెటాబాలిజాన్ని పెంచి కంటి చూపు కూడా మెరుగుపరుస్తాయి.