Climbing Stairs : మెట్లు ఎక్కడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలుసా!

శరీర కండరాలు మెట్లు ఎక్కడం ధృఢంగా మారతాయి. శరీరానికి ఇదొక మంచి వ్యాయామం. కాలి కండరాలను బలోపేత కావటంతోపాటు, ఎక్కువ కేలరీలను బర్న్ అవుతాయి. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి.

Climbing Stairs : మెట్లు ఎక్కడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలుసా!

Climbing Stairs

Climbing Stairs : భవిష్యత్తులో గుండె సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతిఒక్కరి చాలా అవసరం. కండరాలను బలపరిచటంతోపాటు, శరీరంలో సత్తువను పెంచే వ్యాయామాలు రోజువారిగా అలవాటు చేసుకోవాలి. వీటిలో నడక, పరుగు, దినచర్యలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వాకింగ్ , జాగింగ్ కంటే మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు.

మెట్లు ఎక్కడం అనేది దినచర్యలో భాగమైనప్పటికీ దీనిని ఒక వ్యాయామ సాధనంగా ఉపయోగించుకోవచ్చని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన జిమ్ పరికరాలను కొనుగోలు చేసే పనిలేకుండానే రోజు మెట్లు ఎక్కి దిగటం వంటివి చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బరువును సులభంగా తగ్గించే మార్గాల్లో నడక కన్నా మెట్లు ఎక్కవటం వల్ల ఎక్కవ ప్రయోజనం పొందవచ్చు. మెట్లు ఎక్కటం అన్నది ప్రారంభించిన తొలినాళ్లల్లో చాలా కష్టంగా అనిపించినప్పటికీ తరువాత అది అలవాటుగా మారిపోతుంది. మెట్లు ఎక్కడం ప్రారంభించిన తొలిరోజుల్లో మోకాలి కీళ్ల నొప్పులు పుడతాయి. స్ధూలకాయులకు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే క్రమం తప్పకుండా చేస్తే నడక కంటే మెట్లు ఎక్కవటం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రతిరోజూ 20-30 నిమిషాలపాటు శారీరక వ్యాయామం చేయటం అవసరమని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు కఠిన తరమైన వ్యాయామాలను ఎంచుకోవలసి ఉంటుంది. అలాంటి వ్యాయామాల్లో మెట్లు ఎక్కడం అన్నది ఒకటి. దీని వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. 10 మెట్లు ఎక్కితే 1 క్యాలరీని బర్న్ అవుతుంది. ఇది ఒకరకంగా స్లో జాగింగ్ కంటే చాలా ఎక్కువ. మెట్లు దిగడం వల్ల కూడా 20 మెట్లకు 1 క్యాలరీ ఖర్చవుతుంది. మెట్లు ఎక్కడం కాస్త కష్టంతో కూడుకున్నదైనప్పటికీ ఈ రకమైన వ్యాయామాలు దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాల్లో తేలింది.

శరీర కండరాలు మెట్లు ఎక్కడం ధృఢంగా మారతాయి. శరీరానికి ఇదొక మంచి వ్యాయామం. కాలి కండరాలను బలోపేత కావటంతోపాటు, ఎక్కువ కేలరీలను బర్న్ అవుతాయి. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. ఒక వారంలో కనీసం 20 మెట్లు ఎక్కిన పురుషులు గుండె ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. మెట్లు ఎక్కిదిగటం వల్ల శ్వాసపక్రియ మెరుగవుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది.

గుండె,ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు ఈ వ్యాయామాన్ని ప్రయత్నించే ముందు వైద్యుని సంప్రదించటం మంచిది. వైద్యుల సూచనలు సలహా తీసుకున్న తరువాతనే మెట్లు ఎక్కడం ప్రారంభించాలి. మెట్లు ఎక్కేటప్పుడు ఛాతీలో నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని గమనించినట్లయితే, వెంటనే ఆపి విశ్రాంతి తీసుకోండి. వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించటం మంచిది.