Asim Munir : భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ వేళ పాకిస్థాన్‌ను కాపాడింది ఆ సాయమే.. ఆసిమ్ మునీర్ సంచలన కామెంట్స్..
Asim Munir : భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ గురించి పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీరు తాజాగా
Asim Munir
Asim Munir : ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేసింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో ఉగ్ర శిబిరాలతో పాటు పాకిస్థాన్ సైనిక స్థావరాలను కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది. దీంతో దాయాది దేశం కాళ్లబేరానికి రావడంతో భారత్ దాడులను ఉపసంహరించుకుంది. అయితే, ఆ ఘటనపై తాజాగా.. పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీరు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇస్లామాబాద్ లో జరిగిన నేషనల్ ఉలెమా కాన్ఫరెన్సులో ఆసిమ్ మునీర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించాడు. భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ఘోరంగా దెబ్బంతింది. ఆ సమయంలో సాయుధ దళాలకు దైవిక సాయం అందింది. దాన్ని మేం ఫీలయ్యాం అని మునీరు చెపుబుతున్న వీడియో బయటకు వచ్చింది.
ఇదే కార్యక్రమంలో ‘జీహాద్’ అంశంపై మునీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఇస్లామిక్ దేశంలో ప్రభుత్వం లేదా అధికారం ఉన్న పాలకుల అనుమతి లేకుండా ఎవరూ సొంతంగా జిహాద్ కు ఆదేశాలు ఇవ్వలేరని స్పష్టం చేశారు. ఎవరైనా తమకు తాముగా ఫత్వాలు జారీ చేయడం చెల్లదని అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్గాన్ తో ఘర్షణల గురించి మునీర్ మాట్లాడాడు.
పాకిస్థాన్ చిన్నారుల రక్తాన్ని అఫ్గాన్ కళ్ల జూస్తోందని మునీరు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన దేశంలో పుట్టుకొస్తున్న తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ ముఠాల్లో 70శాతం అఫ్గాన్ పౌరులే ఉంటున్నారని, తాలిబన్ ప్రభుత్వం ఇకనైనా ఈ సీమాంతర ఉగ్రదాడులను ప్రోత్సహించడం మానుకోవాలని మునీర్ హెచ్చరించారు.
