Coconut Water : కొబ్బరి నీరు సేవించటం వల్ల శరీరానికి మేలే!…

తల తిరగడం, కడుపులో గడబిడలాంటి వాటిని కొబ్బరినీళ్లు బాగా తగ్గిస్తాయి. గుండె జబ్బులు గల వారికి కొబ్బరి నీరు. హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించగలదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

Coconut Water : కొబ్బరి నీరు సేవించటం వల్ల శరీరానికి మేలే!…

Coconut

Coconut Water : కొబ్బరి నీటిని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వేసవి కాలంలో తీసుకుంటారు. సమ్మర్ హీట్ తగ్గించుకునేందుకు బాగా ఉపకరిస్తుంది. వేసవిలో కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని హీట్ ని ఇట్టే తగ్గించి కూల్ చేసే అద్భుతమైన లక్షణం దీనిలో ఉంది. కొబ్బరి బొండం నీటిని ఎండాకాలమే కాకుండా అన్ని కాలాల్లోనూ తాగొచ్చు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఇందులో పొటాషియం ఎక్కువ కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా ఉంటాయి. ఫ్యాట్‌ కంటెంట్‌ ఉండకపోవడం, మాంగనీస్‌ ఎక్కువగా ఉండడం వలన బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. కొబ్బరి నీరులో సహజ ఎంజైమ్స్, మినర్సల్ ఉంటాయి.

షుగరు తో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లు తాగితే షుగర్అదుపులో ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చెయ్యడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాల మంచి పద్దతి. జీర్ణక్రియారేటు పెరిగి నడుము, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుందని అనేకమైన పరిశోధనల్లో తేలింది. మూత్రకోశ ఇన్ ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. శృంగార శక్తిని పెంచడంలో కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది. కొబ్బరి నీరు మూత్ర, వ్యవస్థలపై థెరపటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

కొబ్బరి నీరు తాగితే త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరినీరు తాగితే మంచిది. మంచి నీళ్ల కంటే కూడా బాగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, ఖనిజాలు పీచుపదార్థం,సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేశాక కొబ్బరినీళ్లు తాగడం వలన శరీరం లో నీరసం తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొబ్బరి నీటిలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా మీ ఎముకల్ని బలంగా చేస్తాయి.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గర్భవతుల్లో మలబద్దకం, జీర్ణకోశంలో సమస్యలు, గుండెలో మంట సాధారణంగా కనిపిస్తాయి. వీటిని కొబ్బరి నీరు తాగడం ద్వారా అధిగమించవచ్చు. గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీళ్ళను తరచూ తాగటం మంచిది. వీటిలో ఉండే యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ. వైరల్ లక్షణాలు చిన్నపిల్లల్ని ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది

తల తిరగడం, కడుపులో గడబిడలాంటి వాటిని కొబ్బరినీళ్లు బాగా తగ్గిస్తాయి. గుండె జబ్బులు గల వారికి కొబ్బరి నీరు. హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించగలదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గుండెజబ్బులకు అధిక రక్తపోటు ప్రధానకారణం. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి. ఈ రెండు ఖనిజాలు గల కొబ్బరి నీరు రక్తపోటును నివారించి, రక్తసరఫరాను మెరుగు చేయడంలో సహకరిస్తుంది. రక్తప్రసరణ తీరు సక్రమంగా ఉండాలంటే తరచూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.

అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వైరస్లు, బాక్టీరియాల బారిన పడ కుండా జాగ్రత్త పడొచ్చు. రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లను ముఖంపై రాసుకుంటే మొటిమలు, మచ్చలు తెలగిపోతాయి. చేతులు, గోళ్లకు రాసుకుంటే మంచి నిగారింపు సంతరించుకకుంటాయి. కొబ్బరికాయలో 94 శాతం నీరు, చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. కొబ్బరి నీటి వినియోగం ఎలుకలలో రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ మరియు ఇన్సులిన్ స్థాయిలను తగ్గించినట్లు ఓ అధ్యయనంలో తేలింది.

డయోబెటిక్ తో బాధపడుతున్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకపోవడం కూడా మంచిది. హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్ సమస్య బారిన పడే అవకాశం ఉంది. మద్యపానం వల్ల శరీరంలోని ఉన్న శక్తి సన్నగిల్లుతుంది. అలాంటి సందర్భాల్లో మీరు కోకనట్ వాటర్ తాగడం చాలా మంచిది.