మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకుంటే మేలు!

అల్లం తింటే లివ‌ర్‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. దీనిలోని జింజ‌రాల్స్‌, షోగోల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్ ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. లివర్‌లో పేరుకుపోయే కొవ్వును క‌రిగిస్తాయి. నిత్యం కొద్ది మోతాదులో అల్లం తీసుకున్నా లేదా అల్లం ర‌సం తాగినా లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది.

మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకుంటే మేలు!

Healthy Liver!

మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉన్న కార్బోహైడ్రేట్లను విచ్చిన్నం చేయడానికి, గ్లూకోస్ గా మార్చేందుకు కాలేయం కీలకం. కాలేయం ఆరోగ్యవంతంగా పనిచేసినప్పుడే మనం తీసుకునే ఆహార పదార్థాలను సరైన క్రమంలో జీర్ణం చేసి అందులో ఉన్న పోషకాలను రక్తంలోకి ప్రవహించేలా చేస్తుంది. నిత్యం మ‌నం తినే అనేక రకాల ఆహార ప‌దార్థాల ద్వారా శ‌రీరంలో పేరుకుపోయే విష ప‌దార్థాలు, వ్య‌ర్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపుతుంది.

ఈ క్ర‌మంలో లివ‌ర్ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇవి మ‌న శ‌రీరానికి హాని క‌లిగించటంతోపాటు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా క‌ల‌గిస్తాయి. దీంతో లివర్ దెబ్బతింటుంది. ఈ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను అడ్డుకునేందుకు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి. అవి లేక‌పోతే లివ‌ర్ ఎక్కువ‌గా డ్యామేజ్ అవుతుంది. ఇందుకు గాను యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ నాశ‌నం అవుతాయి. దీనివల్ల లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ కు మేలు కలిగాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. ప‌సుపు ; లివ‌ర్‌ను శుభ్ర ప‌ర‌చ‌డంలో ప‌సుపు అత్యుత్త‌మంగా ప‌నిచేస్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. ప‌సుపును నిత్యం 1.5 నుంచి 3 గ్రాముల మోతాదులో తీసుకుంటే లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

2. చేప‌లు, కోడిగుడ్లు, వాల్‌న‌ట్స్ ; చేపలు, గుడ్లు , వాల్ నట్స్ లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లం.. ఇవి లివ‌ర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లివ‌ర్‌లో పేరుకుపోయే కొవ్వును క‌రిగించి లివ‌ర్ ను శుభ్ర‌పరుస్తాయి. తద్వారా లివ‌ర్ ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. వారంలో కనీసం 2 సార్లు ఈ ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

3. బీట్‌రూట్ ; బీట్‌రూట్‌లో బీటాలెయిన్స్‌, ఫ్లేవ‌నాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేయటంతోపాటు లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. నిత్యం 1 గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. వారంలో క‌నీసం 2, 3 రోజుల పాటు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

4. ద్రాక్ష ; లివ‌ర్‌ను శుభ్రం చేయ‌డంలో ద్రాక్ష‌లు అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. నిత్యం ఒక క‌ప్పు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు తొలగిపోతాయి.

5. ఉసిరికాయ జ్యూస్ ; ఉసిరికాయ జ్యూస్ లివ‌ర్‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన టానిక్‌లా ప‌నిచేస్తుంది. ఆయుర్వేద మందుల త‌యారీలో దీనిని ఉప‌యోగిస్తారు. ఉసిరికాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్రభావాన్ని త‌గ్గించి లివ‌ర్‌ను క్లీన్ చేస్తాయి. నిత్యం ఉసిరికాయ జ్యూస్ తాగ‌డం లేదా 1 నుంచి 3 గ్రాముల ఉసిరి కాయ పౌడ‌ర్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల లివ‌ర్ కు మేలు కలుగుతుంది.

6. అల్లం ; అల్లం తింటే లివ‌ర్‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. దీనిలోని జింజ‌రాల్స్‌, షోగోల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్ ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. లివర్‌లో పేరుకుపోయే కొవ్వును క‌రిగిస్తాయి. నిత్యం కొద్ది మోతాదులో అల్లం తీసుకున్నా లేదా అల్లం ర‌సం తాగినా లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

7. న‌ట్స్ ; బాదం, పిస్తా, వాల్‌న‌ట్స్‌లో ఉండే విట‌మిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది లివ‌ర్‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. 6 నెల‌ల పాటు నిరంత‌రాయంగా న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి నుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. నిత్యం ఒక గుప్పెడు న‌ట్స్‌ను తింటే లివ‌ర్ శుభ్ర‌ం కావటంతోపాటు లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

8. ఆలివ్ ఆయిల్‌ ; ఆలివ్ ఆయిల్‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఆలివ్ఆ యిల్‌ను నిత్యం 1 టీస్పూన్ మోతాదులో తీసుకున్నా చాలు లివ‌ర్ శుభ్ర‌పడుతుంది.

9. ఉల్లిపాయ‌లు, వెల్లుల్లి ; ఈ రెండిటిల్లో ఫ్లేవ‌నాయిడ్లు అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. ప్రతిరోజు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బలు 2, 3 లేదా ప‌చ్చి ఉల్లిపాయ‌లు 50 గ్రాములు తిన‌డం వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.