Lose Weight : సన్నగా మారాలనుకునే వారు ఇలా చేసి చూడండి!…

వేడి నీళ్ళు తాగుతుండడం, వేడి నీటి స్నానం చేయడం వంటివి చేయాలి. పెరుగుకు బదులుగా మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది. అందులోను వెన్నతీసిన పాలతో తయారై మజ్జిగ తీసుకోవటం వల్ల అనవసరమైన కొవ్వులు చేరకుండా చూసుకోవచ్చు.

Lose Weight : సన్నగా మారాలనుకునే వారు ఇలా చేసి చూడండి!…

Lose Weight

Lose Weight : సన్నగా ,నాజూకుగా మారాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే మారిన ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తమ కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాగని కడుపు కట్టుకుని కూర్చుంటే నీరసానికి తోడు , ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం ద్వారా బరువు, స్ధూలకాయం వంటి సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. సన్నగా మారాలనుకొనే వారు వారు కొన్ని సూచనలను పాటిస్తే సరైన ఫలితం ఉంటుంది.

రుచికరమైన ఆహారం అంటే చాలు చాలా మంది లొట్టలేసుకుని అతిగా లాగించేస్తుంటారు. ఇలా చేయటం వల్ల బరువు సమస్య తలెత్తుతుంది. అన్ని రుచులూ కలిగిన ఆహార పదార్థాలను తినడం మానేయాలి. ముఖ్యంగా వేపుడు కూరలకు బదులుగా పులుసు కూరలు తీసుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి.

మనం తీసుకునే ఆహారాన్ని సమయానుగుణంగా తీసుకోవాలి. దీనితోపాటు కొద్ది కొద్ది మొత్తంలో రోజుకు 5సార్లుగా తీసుకోవటం మంచిది. ఒకేసారి మోతాదుకు మించి ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణప్రక్రియల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి తక్కువ మొత్తాల్లో ఆహారం తినాలి.

వ్యాయామానికి ముందు కనీసం ఏడాది పాటు పాత తేనెను 2 చెంచాలు ,గ్లాసెడు గోరు వెచ్చని నీటికి కలిపి తాగాలి. అలాగే నిమ్మరసం, తేనె వేడినీటితో కలుపుకుని తాగటం వల్ల సన్నబడేందుకు అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో పీచు కలిగిన ఓట్స్ ,బార్లీ వంటి శూక ధాన్యం తినాలి. బియ్యం తినే వాళ్ళు ఏడాది పాతబడిన బియ్యాన్ని ఆహారంగా వండుకుని తినాలి.

వేడి నీళ్ళు తాగుతుండడం, వేడి నీటి స్నానం చేయడం వంటివి చేయాలి. పెరుగుకు బదులుగా మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది. అందులోను వెన్నతీసిన పాలతో తయారై మజ్జిగ తీసుకోవటం వల్ల అనవసరమైన కొవ్వులు చేరకుండా చూసుకోవచ్చు.

శరీరానికి,మనసుకు ఎప్పుడూ ఏదో వ్యాపకం కలిగించుకుంటుండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయటం వల్ల ఉల్లాసంగా ఉండటంతో పాటు శరీరంలో అనవసరంగా పేరుకున్న కొలెస్ట్రాల్ మోతాదులు కరిగిపోతాయి.

స్నానానికి ముందు పెసర్లు,చిరుశనగలు మొదలైన పదార్థాలతో చేసిన సున్ని పిండితో వేడి పుట్టేలా నలుగు పెట్టుకోవాలి. మెత్తటి సోఫాలూ,పరుపులపై నిద్రించరాదు. పగటి పూట నిద్ర పోరాదు. రాత్రి సమయంలో సమయానికి నిద్రపోవాలి.