Garlic : గొంతు కండరాల నొప్పిని తగ్గించే వెల్లుల్లి !

షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచటంలో వెల్లుల్లి సహాయపడుతుంది. అంతేకాకుండా కార్డియో వాస్కులర్ ఆరోగ్యానికి మేలు చేసి, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది.

Garlic : గొంతు కండరాల నొప్పిని తగ్గించే వెల్లుల్లి !

Garlic that reduces sore throat!

Garlic : ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లిలో ఎన్నో అద్భుతమైన ఔషధగుణాలు ఉన్నాయి. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరుస్తుంది. హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా మంచిది. పచ్చి వెల్లుల్లి బీపీ ని తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాల్లో నిరూపితమైంది.

షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచటంలో వెల్లుల్లి సహాయపడుతుంది. అంతేకాకుండా కార్డియో వాస్కులర్ ఆరోగ్యానికి మేలు చేసి, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. గొంతు కండరాల నొప్పిని తగ్గించి మింగడంలో ఇబ్బంది లేకుండా చేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు.

వెల్లుల్లిలోని సల్ఫర్ ఎర్ర రక్త కణాల ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుగా మారుతుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరుస్తుంది. ఫలితంగా గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అల్జీమర్స్, డీమెన్షియా వంటి క్షీణించిన వ్యాధులని నివారించడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా వెల్లుల్లి నీరు మేలు చేస్తుంది. రోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.

గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడకుండా చూసుకోవచ్చు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది. వెల్లుల్లిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి.