ఇదిగో కొత్త ఫీచర్ : స్మార్ట్ ఫోన్ వ్యసనానికి చెక్ పెట్టండిలా!

  • Published By: sreehari ,Published On : December 6, 2019 / 08:24 AM IST
ఇదిగో కొత్త ఫీచర్ : స్మార్ట్ ఫోన్ వ్యసనానికి చెక్ పెట్టండిలా!

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లదే ట్రెండ్. ప్రతిఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ లేనిదే పూట గడవని పరిస్థితి. ఇదో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఆహారం, నీళ్లు లేకుండా అయినా ఉంటారేమోగానీ క్షణం చేతిలో స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ చూడకుండా ఉండలేరనడంలో అతిశయోక్తి కాదు.

మద్యం, ధూమపానమైన మానొచ్చు గానీ స్మార్ట్ ఫోన్ పక్కన లేకుండా ఉండలేమనే స్థితికి చేరుకున్నారు మొబైల్ యూజర్లు. అంతగా స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిపోరంతా. ఆఫీసుల్లో ఉన్నా, షాపింగ్ చేసినా లేదా జర్నీలో ఉన్నా సరే, కూర్చొన్న, తినే సమయంలో ప్రతి చోట స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.

స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ పని కూడా చేయలేరు. దేనిపై ఏకాగ్రత పెట్టలేరు. స్మార్ట్ ఫోన్లో ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా ఏంటా అని తెగ చెక్ చేస్తుంటారు. మెసేజ్ వచ్చినా ఉలిక్కిపడుతుంటారు. నోటిఫికేషన్ వచ్చినా కలవర పడుతుంటారు. ఆఖరికి రెండేళ్ల పసిప్రాయంలోని చిన్నారులు కూడా స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ చూడకుండా నిద్రపోవడం లేదు. కాసేపు స్మార్ట్ ఫోన్ పిల్లల నుంచి లాగేస్తే.. ఇచ్చేదాకా ఏడవకుండా ఉండరు. అంటే.. స్మార్ట్ ఫోన్ మనిషి జీవన విధానంపై ఎంతగా ప్రభావం చూపిందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.

ఇక ఎప్పటికీ స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండలేమా? స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. దీనికో మరో మార్గమే లేదా అంటే.. అవును ఉంది అంటోంది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్. ఈ ఏడాదిలో స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిన యూజర్ల కోసం ఓ కొత్త ఫీచర్ లాంచ్ చేసింది.

అదే.. Focus Mode ఫీచర్. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్ల కోసం ఈ ఫోకస్ మోడ్ ఫీచర్ తీసుకొచ్చింది. గతంలో ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. తరచూ స్మార్ట్ ఫోన్లతో కలవరపాటుకు గురయ్యే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఫోకస్ మోడ్ ఫీచర్ ను డిజైన్ చేసింది.

Focus Modeలో మరిన్ని కొత్త ఫీచర్లు :
ఫోకస్ మోడ్ ఫీచర్ పై యూజర్ల నుంచి వచ్చే స్పందన ఆధారంగా గూగుల్ ఈ ఫీచర్ కు మరిన్ని కొత్త ఫీచర్లను జోడించనుంది. బీటా స్టేజ్ లో ఉన్నప్పుడే ఈ ఫీచర్లను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. స్మార్ట్ ఫోన్లలో Focus Mode షెడ్యూల్ చేసుకునేలా ఉండటం నుంచి ఆటోమాటిక్ గా ఫీచర్ యాక్టివేట్ అయ్యేలా మార్పులు చేయనుంది. వారంలో నిర్దిష్ట రోజుల్లో, నిర్దిష్ట సమయానికి మాత్రమే Focus mode యాక్టీవ్‌గా ఉండేలా ఫీచర్లను యాడ్ చేయనుంది.

Take a Break ఆప్షన్ :
అంతేకాదు.. Focus Modeలో Take a Break అనే ఆప్షన్ కూడా యాడ్ చేస్తోంది. దీనిద్వారా Focus Mode పూర్తిగా టర్నింగ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండానే యాప్స్ బ్లాక్ చేసుకోవచ్చు. అది కూడా సంక్షిప్తంగా యాప్ యాక్సస్ చేసుకునేలా సెట్ చేసుకోవచ్చు.

తద్వారా ఫేస్ బుక్ ఫొటో లేదా యూట్యూబ్ వీడియోలను ఫోకస్ మోడ్ నుంచి బయటకు రాకుండానే ఈజీగా ఇతరులకు కనిపించేలా చేస్తుంది. ‘షెడ్యూలింగ్ ఫీచర్ ద్వారా యూజర్లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని, ఏ సమయంలో దీన్ని వాడొచ్చో ఈజీగా యూజర్లు గుర్తించేలా ఉంటుందని గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ రోజ్ లా ప్రాయిరే అభిప్రాయపడ్డారు.

స్మార్ట్ ఫోన్లు, టెక్నాలజీ, సోషల్ మీడియా అడిక్షన్ తీవ్రత యూజర్లలో పెరిగిపోతున్న తరుణంలో తమపై విశ్వాసాన్ని పెంచేలా ఈ ఫోకస్ మోడ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. స్మార్ట్ ఫోన్ల అడిక్షన్‌కు సంబంధించి ఓ అధ్యయనం జనరల్ BMC Psychiatryలో ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం.. యువకులు, చిన్నారుల్లో నలుగురిలో ఒకరు స్మార్ట్ ఫోన్ల స్ర్కీన్లకు ఎక్కువ శాతం అడిక్ట్ అయినట్టు తెలిపింది.

టెక్ అడిక్షన్‌పై ఆపిల్, గూగుల్ ఫైట్ :
టెక్ అడిక్షన్ పై పోరాటంలో భాగంగా గూగుల్, ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాయి. గత ఏడాదిలో ఈ రెండు కంపెనీలు కలిసి iPhone, Android ఫోన్ యూజర్ల కోసం Dashboards లాంచ్ చేశాయి. తమ స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేకించి ఏ యాప్స్ తరచూ వాడుతున్నారో గుర్తించేలా డ్యాష్ బోర్డులను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఆపిల్ Screen Time అనే ఫీచర్ తీసుకొచ్చింది.

గూగుల్ నుంచి స్ర్కీన్ మేనేజ్ మెంట్ టూల్ Digital Wellbeing ష్యూట్ పేరుతో ప్రవేశపెట్టింది. గూగుల్ ఇప్పుడు ప్రవేశపెట్టిన Focus Mode ఫీచర్.. Digital Wellbeingకు లేటెస్ట్ అడిక్షన్ టూల్. ఈ ఫోకస్ మోడ్ ఫీచర్ ద్వారా మీ ఫోన్లో లైట్ వెలగడంతో పాటు అనవసరమైన నోటిఫికేషన్లను నిలిపివేస్తుందని గూగుల్ ఆశిస్తోంది.

ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
* Focus Mode ఫీచర్.. మీ ఫోన్లో Appsను సైలెంట్ మోడ్‌కు మార్చేస్తుంది.
* సోషల్ మీడియా యాప్స్, ఈమెయిల్ యాప్స్ Block చేస్తుంది.
* ఫోకస్ మోడ్.. స్విచ్ ఆఫ్ చేస్తే.. మళ్లీ Apps రీ-ఎనేబుల్ అవుతాయి.
* ఈ ఫీచర్ Turned On అయితే.. ఫోన్లలో Apps ఓపెన్ చేయలేరు.
* Apps అన్నీ Pause అయినట్టుగా మీ ఫోన్ రిమైండ్ చేస్తుంది.
* Apps నోటిఫికేషన్స్ కూడా Pause అయి mute అవుతాయి.