Guruvinda Nuts : రాలిన జుట్టును మొలిపించే గురువింద గింజలు?

గురువింద ఆకులను ఆముదం రాసి వేడి చేసి వాపులు ఉన్నచోట కట్టుకడితే త్వరగా తగ్గుతాయి. చర్మం పై తెల్లని మచ్చలుంటే..

Guruvinda Nuts : రాలిన జుట్టును మొలిపించే గురువింద గింజలు?

Guruvinda

Guruvinda Nuts : గురువింద ఇది తీగ జాతి మొక్క.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ గురివింద గింజలను లక్ష్మి స్వరూపంగా కొలుస్తారు. పూర్వం బంగారాన్ని గురువింద గింజలతో తూకం వేసేవారు. ఇవి ఆకుపచ్చ, పసుపు, తెలుగు, నలుపు రకాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా ఎరుపు రంగు గురివింద గింజలను చూస్తుంటారు.. మిగిలిన రంగులు అరుదుగా కనిపిస్తాయి. ఈ చెట్టు గింజలు విషపూరితం..

ఈ చెట్టు ఆకులు, కాండంలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గురివింద గింజలు, ఆకులు, వేర్లు సాంప్రదాయ ఔషధంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువ అయింది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.

జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవటానికి గురివింద గింజలు ఉపయోగించి నూనె తయారు తయారుచేసుకోవాలి. ఈ గింజలు మనలో చాలా మందికి తెలుసు. ఈ గురివింద గింజలు ఆయుర్వేదం షాప్ లో అందుబాటులో ఉంటాయి. ఈ గింజలను 20 నుంచి 30 వరకు తీసుకొని మిక్సీలో వేసి పప్పులా చేసుకోవాలి. ఈ పప్పును ఒక మందపాటి గుడ్డలో వేసి మూట కట్టి స్టౌ పై అర గ్లాసు పాలను పెట్టి ఈ మూటను దానిలో వేసి పాలు దగ్గరయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

ఈవిధంగా పాలల్లో ఉడికించడం వలన గురివింద గింజలలో ఉన్న ఔషధ గుణాలు బయటకు వస్తాయి. 100 గ్రాములు కొబ్బరి నూనెలో ఒక స్పూన్ బృంగరాజ్ పౌడర్ వేసి ఒక నిమిషం వేగించాలి. ఆ తర్వాత ఉడికించుకున్న గురువింద గింజ పప్పు కూడా వేయాలి.పొయ్యి మీద నూనె మరిగే వరకు ఉంచాలి.

ఈ నూనె చల్లారాక వడకట్టి నిలువ చేసుకోవాలి. ఈ నూనెను తలకు రాసి అలా ఉంచుకోవచ్చు లేదా మరుసటి రోజు ఉదయం తల స్నానం చేయవచ్చు ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా తెల్లజుట్టు సమస్య కూడా తొలగిపోయింది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పేనుకొరుకుడుకి పొట్టు తీసిన గురువింద గింజలు మంచి మెడిసిన్. ముందుగా గురువింద గింజల పై ఉన్న పొట్టును తీసి అరగ తీయాలి. అందులో నువ్వుల నూనె కలిపి పేనుకొరుకుడు ఉన్న ప్రాంతంలో రెగ్యులర్ గా తలకురాస్తే వెంట్రుకలు తిరిగి వస్తాయి. గురివింద గింజల తో వేసే పొగ మన ఇంట్లో దోమలు పోతాయి. వారంలో రెండు రోజులు ఈ పొగ వేయడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా దోమలు గుడ్లు పెట్టకుండా చేస్తుంది.

గురువింద ఆకులను ఆముదం రాసి వేడి చేసి వాపులు ఉన్నచోట కట్టుకడితే త్వరగా తగ్గుతాయి. చర్మం పై తెల్లని మచ్చలుంటే.. ఈ ఆకుల రసాన్ని తీసుకుని ఆ మచ్చలపై రాసుకుని ఒక 15 నిమిషాల పాటు ఎండలో నిలబడి.. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. దగ్గుతో ఇబ్బంది పడుతుంటే గురివింద గింజల ఆకుల చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది.

గురువింద గింజల ను లక్ష్మి స్వరూపాలుగా భావిస్తారు. తెలుపు రంగు గింజలు శుక్ర గ్రహ దోష నివారణకు, ఎరుపు రంగు గింజలు కుజ గ్రహ దోష నివారణకు, నలుపు రంగు గింజలు శని గ్రహ దోష నివారణకు, పసుపు రంగు గింజలు గురు గ్రహ దోష నివారణకు, ఆకు పచ్చ రంగు గింజలు బుధ గ్రహ దోష నివారణకు ఉపయోగపడతాయి..