Rose Tea : రాత్రి సమయంలో రోజ్ టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

రాత్రి సమయంలో రోజు టీ తాగటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వేస‌వి తాపం, వేడి నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఆందోళ‌న‌, ఒత్తిడి వంటి మాన‌సిక స‌మ‌స్యలు త‌గ్గి మ‌నస్సు ప్ర‌శాంతంగా మారుతుంది.

Rose Tea : రాత్రి సమయంలో రోజ్ టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

Rose Tea :

Rose Tea : గులాబీలు అందమైన పువ్వులు, సాంస్కృతిక, ఆరోగ్యం మరియు సౌందర్య ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. గులాబీలలో వేల రకాలు ఉన్నాయి. అన్ని గులాబీలు తినదగినవి మరియు టీ చేయడానికి ఉపయోగించవచ్చు, గులాబీలను తరచుగా వంటలో ఉపయోగిస్తారు, ముఖ్యంగా మధ్యప్రాచ్య, భారతీయ మరియు చైనీస్ వంటకాలలో గులాబీ రేకులను ఉపయోగిస్తారు. గులాబీ రేకులను టీతో కలిపి తాగే అలవాటు చైనాలో మొదలైనట్లు తెలుస్తుంది. రోజ్ టీ అనేది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో కీలకమైన భాగం, ఇక్కడ ఇది క్వి లేదా లైఫ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగించబడుతుంది.

రోజ్ టీ అనేది హెర్బల్ పానీయం, ఇది ఎండిన గులాబీ మొగ్గలు లేదా రేకులను వేడినీటిలో ఉంచడం ద్వారా తయారు చేయబడుతుంది. రోజ్ టీ సహజంగా కెఫిన్ లేనిది. ఇది జీర్ణ మరియు కడుపు సమస్యలు తగ్గేలా చేస్తుంది. అలసటను నివారించి మరియు నిద్ర మెరుగుదల ఉండేలా చేస్తుంది. చిరాకు అలాగే మూడ్ హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. రుతుక్రమం ఆగిన లక్షణాలు మరియు ఋతు తిమ్మిరి వంటి వాటికి బాగా ఉపకరిస్తుంది. రోజువారిగా గులాబీ టీ తీసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ముఖ్యంగా సీజ‌న‌ల్ ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం త‌గ్గుతాయి.

రాత్రి సమయంలో రోజు టీ తాగటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వేస‌వి తాపం, వేడి నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఆందోళ‌న‌, ఒత్తిడి వంటి మాన‌సిక స‌మ‌స్యలు త‌గ్గి మ‌నస్సు ప్ర‌శాంతంగా మారుతుంది. హాయిగా నిద్ర ప‌డుతుంది. నిద్ర‌లేమి సమస్యలు తొలగిపోతాయి. శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కుపోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర పడుతుంది. అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు అధికంగా ఉన్న‌వారు గులాబీ పువ్వుల టీని తాగితే కొవ్వును క‌రిగిస్తుంది. బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది.

రోజ్ టీ తయారీ ;

రోజ్ టీ తయారీకి ఎండిన గులాబీలు మూడు, గులాబీ వాటర్ టీస్పూన్, తేనె రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం అరటీ స్పూన్, నీళ్లు లీటర్, గ్రీన్ టీ బ్యాగులు రెండు తీసుకోవాలి.

ముందుగా పావు లీటరు నీటిని బాగా మరిగించి గులాబీరేకులు, నిమ్మరసం వేయాలి. పొయ్యి పై నుండి దించి 5గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. గులాబీ రేకులు బాగా నాని అందులోని సారం నీటిలోకి చేరుతుంది. ఆప్పుడు రెండు గ్రీన్ టీ బ్యాగులు ఆ నీటిలో వేసుకుని తిరిగి మరిగించుకోవాలి. ఐదునిమిషాల తరువాత తేనె వేసుకుని వడకట్టుకుని తీసుకోవాలి.