Healthy Lungs : ఊపిరితిత్తుల క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లే ముఖ్యం! ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ ఆహారాలు తీసుకోవటం మేలు!

ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారానే ఊపరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాణాంతకమన్న విషయాన్ని ముందుగా గుర్తెరగాలి.

Healthy Lungs : ఊపిరితిత్తుల క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లే ముఖ్యం! ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ ఆహారాలు తీసుకోవటం మేలు!

Healthy Lungs

Healthy Lungs : ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. మన శరీరంలో ఊపిరి తిత్తులు ప్రధాన పాత్రని పోషిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉంటే భయంకర వ్యాధులు అనేవి అసలు రావు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఉపద్రవాల నుండి బయటపడాలంటే వ్యాధుల లక్షణాలను ముందే పసిగట్టాలి. ఇటీవలి కాలంలో చాలా మంది ఊపరితిత్తుల క్యాన్సర్ బారిన పడి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు.

పొగతాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ముఖ్య కారకం. సిగరెట్ పొగ కారణంగా చాలా మంది వ్యక్తుల్లో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. క్రమేపి దీనికారణంగా ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణితి అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో ధూమపానం చేయని వారిలో 25శాతం మంది లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 65 ఏళ్లు పైబడిన ప్రతి ముగ్గురిలో ఇద్దరు లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్ దరిచేరకుండా ఉండేందుకు ;

ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారానే ఊపరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాణాంతకమన్న విషయాన్ని ముందుగా గుర్తెరగాలి. ఊపరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే బ్లూబెర్రీస్, ఆస్పరాగస్, యాపిల్స్, బ్రోకలీ వంటి ఆహారాన్ని తీసుకోవాలి. వీటి వల్ల ఫ్రీ రాడికల్స్‌ని బయటికి పంపి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కార్డియో రెస్పిరేటరీ వ్యవస్థ బలపడేందుకు, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి రోజువారిగా వ్యాయామాలు ఎంచుకోవటం మంచిది. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి.

ఊపిరితిత్తులకు మేలు చేసే ఆహారాలు ;

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ప‌లు ఆహారాల‌ను తీసుకోవటం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేంగా కొన్ని రకాల ఆహారాలు బాగా ఉపకరిస్తాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ద్రాక్ష ; ద్రాక్ష పండ్ల‌లో నరింగిన్ అన‌బ‌డే ఫ్లేవ‌నాయిడ్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

యాపిల్స్ ; యాపిల్స్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు విటమిన్ బి, సి, ఇ లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.

దానిమ్మ ; దానిమ్మ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో కణాల‌ను ర‌క్షిస్తాయి. క‌ణతులు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. దీంతోపాటు శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

ఉల్లిపాయలు ; ఉల్లిపాయ‌ల్లో ఉండే స‌ల్ఫ‌ర్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అందువ‌ల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. నిత్యం ఉల్లిపాయ‌ల‌ను తినాల‌ని వారు సూచిస్తున్నారు.

క్యారెట్లు ; క్యారెట్లలో విట‌మిన్ ఎ, సిలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి.

ప‌సుపు ; ప‌సుపులో క‌ర్‌క్యుమిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల‌ను ర‌క్షిస్తుంది. వైర‌స్‌ల‌ను నాశ‌నం చేస్తుంది. నిత్యం పాల‌ల్లో ప‌సుపును క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

న‌ట్స్‌ ; బాదం, పిస్తా ప‌ప్పులు, వాల్‌న‌ట్స్‌, హేజ‌ల్ న‌ట్స్‌.. త‌దిత‌ర న‌ట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.