Nails : గోర్లు వేగంగా పెరిగేలా చేసే…హోం రెమెడీస్!…

ఫిష్ ఆయిల్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి, గోళ్లను తేమగా ఉంచేందుకు ఈ అమ్లాలు సహాయపడతాయి, అంతేకాకుండా గోర్లు వేగంగా ఆరోగ్యంగా పెరుగుతాయి.

Nails : గోర్లు వేగంగా పెరిగేలా చేసే…హోం రెమెడీస్!…

Make Nails Grow Faster

Nails : చేతి వేళ్ల గోర్లు పెంచుకోవటానికి మహిళలు ఎక్కవగా ఆసక్తి చూపిస్తుంటారు. వారి అందాన్ని మరింత రెట్టింపు చేయటంలో చేతి వేళ్ల గోర్లు సహాయపడతాయి. పొడవైన గోర్లకు వివిధ రకాల కలర్స్ తో అలంకరించి మరింత అందంగా తీర్చిదిద్దుతారు. కొన్ని సందర్భాల్లో ముచ్చటగా పెంచుకున్న గోర్లు విరిగిపోతే ఎంతో నిరాశ చెందుతారు. గోర్ల అందం కోసం చాలా మంది ఖరీదైన పద్దతలును అనుసరిస్తుంటారు. అయితే వీటన్నింటి కంటే గోర్లు ఆరోగ్యంగా, అందంగా చూడముచ్చటగా ఉండాలంటే మీ వంటగదిలో లభించే కొన్ని రకాల పదార్ధాలు ఎంతగానో సహాయపడతాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

1. అరటి పండు, కోడి గుడ్డు ; కోడిగుడ్డు, అరటి పండు గోర్ల బలాన్ని మెరుగుపరచటంలో దోహదపడతాయి. అరటిపండ్లు, కోడి గుడ్లలో బయోటిన్ అనే పదార్ధం ఉంటుంది. వీటిని రోజువారి ఆహారంలో తీసుకోవటం ద్వారా గోర్లకు మేలు కలుగుతుంది. అంతే కాకుండా ఈ పదార్ధాలను ఉపయోగించి గోర్లను బలంగా మార్చుకోవచ్చు.

ఇందుకు గాను చేయాల్సిందల్లా 2టేబుల్ స్పూన్ మెత్తని అరంటి గుజ్జు, ఒక కోడి గుడ్డు తీసుకోవాలి. చిన్న గిన్నెలో కోడిగుడ్డు పగులగొట్టి సొనవేయాలి. మెత్తిని అరటిగుజ్జు వేసి రెండు పదార్ధాలను కలిపి పేస్ట్ లా చేయాలి. అనంతరం గిన్నెలో మీ చేతి వేళ్ల గోర్లను 15 నిమిషాలపాటు ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కడిగి శుభ్రమైన పొడిగా ఉండే టవల్ తో తుడుచుకోవాలి. రోజులో ఇలా రెండు సార్లు చేస్తే గోర్లు వేగంగా పెరుగుతాయి, బలంగా మారతాయి.

2. ఆరెంజ్, నిమ్మ ; నారింజ మరియు నిమ్మకాయలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది. కొల్లాజెన్ అనేది చేతి వేలుగోళ్ల కణాజాలాలను బలంగా చేసేందుకు, గోరు పెరుగుదలకు దోహదపడుతుంది. ఇందుకుగాను చేయాల్సిందల్లా కప్పు నారింజ రసం, టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఒక గిన్నెలో, కొద్దిగా నారింజ రసం , కొంచెం నిమ్మరసం వేసి రెండు పదార్థాలను బాగా కలపాలి. వేలుగోళ్లను ఈ మిశ్రమంలో 15 నిమిషాలపాటు ఉంచాలి. తరువాత చల్లని నీటితో చేతులు కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే గోర్లు త్వరగా పెరగటంతోపాటు బలంగా ఉంటాయి.

3. అవోకాడో, కివి,హనీ ; అవోకాడోస్ , కివిలో జింక్ పుష్కలంగా ఉంటుంది, ఇవి గోర్లు ఆరోగ్యంగా వేగంగా వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. జింక్ లోపం వల్ల గోళ్ళపై తెలుపు రంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అవోకాడో, కివి, హనీ కలిపిన మిశ్రమంతో మీ గోర్లను ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు.

ఇందుకు చేయాల్సిందల్లా టేబుల్ స్పూన్ అవోకాడో గుజ్జు, టేబుల్ స్పూన్ కివి గుజ్జు, టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో, మెత్తని అవోకాడో గుజ్జు ,కొంత కివి గుజ్జు, కొంచెం తేనె వేసి బాగా కలపాలి. ఆ పేస్ట్ ను వేలు గోళ్లపై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడిగి పొడి టవల్ తో తుడవాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే గోర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.

4. ఫిష్ ఆయిల్ ; ఫిష్ ఆయిల్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి, గోళ్లను తేమగా ఉంచేందుకు ఈ అమ్లాలు సహాయపడతాయి, అంతేకాకుండా గోర్లు వేగంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందుకోసం చేయాల్సిందల్లా చేప నూనెను తీసుకుని అందులో దూదిని ముంచి ఆనూనెను వేళ్ల గోర్లపై అప్లై చేయాలి. అరగంటపాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయటం వల్ల గోర్లు బాగా పెరగటంతోపాటు అందంగా ఉంటాయి.

5.పాలు , పెరుగు ; గోర్లు కెరాటిన్ అనే ఫైబరస్ ప్రోటీన్ తో తయారవుతాయి, ఇది ప్రధానంగా గోళ్ళను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది. గోర్లకు నష్టకలగకుండా రక్షిస్తుంది. గోళ్ళలో కెరాటిన్ యొక్క సమతుల్యతను కాపాడటానికి, కెరాటిన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ ఉండే ఆహారాలైన పాలు, పెరుగు వంటి వాటిని తీసుకోవాలి. ఇవి గోర్లు ఆరోగ్యవంతంగా పెరిగేలా చేస్తాయి.

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా , 2 టేబుల్ స్పూన్లు పాలు, టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో, కొంచెం పాలు, పెరుగు వేసి బాగా కలపాలి. గోళ్లను ఆ మిశ్రమంలో ముంచి సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత బయటకు తీసి చేతులను బాగా కడగాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గోర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.