Drink Water : భోజనం చేయటానికి ముందు, చేసిన తరువాత ఎంత సమయానికి నీళ్లను తాగితే ప్రయోజనమంటే!

నీటిని తాగే విషయంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఊపిరితిత్తుల ద్వారా, చెమట ద్వారా, మలమూత్రాల ద్వారా రోజుకు రెండున్నర లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అంటే 2 నుంచి రెండున్నర లీటర్ల నీరు ప్రతిరోజు మనం శరీరానికి అందిస్తే సరిపోతుంది.

Drink Water : భోజనం చేయటానికి ముందు, చేసిన తరువాత ఎంత సమయానికి నీళ్లను తాగితే ప్రయోజనమంటే!

drink water before and after eating

Drink Water : మన శరీరానికి ప్రాణవాయువు, నీరు, ఆహారం ఈ మూడు జీవనాధారాల వంటివి. ఈ మూడింటిలో అతి ముఖ్యమైనది నీరు. నీరు శరీరంలో 70 శాతం ఆక్రమించి ఉంటుంది. చాలా మంది ఆహారం అధిక మోతాదులో తీసుకుని నీటిని తక్కువగా తీసుకుంటున్నారు. రోజువారి శరీర అవసరాల మేరకు నీటిని తాగాల్సిన అవసరం ఉంటుంది. నీటిని తాగే విషయంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఊపిరితిత్తుల ద్వారా, చెమట ద్వారా, మలమూత్రాల ద్వారా రోజుకు రెండున్నర లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అంటే 2 నుంచి రెండున్నర లీటర్ల నీరు ప్రతిరోజు మనం శరీరానికి అందిస్తే సరిపోతుంది.

అయితే రోజువారిగా నీటిని ఏసందర్భాల్లో తప్పనిసరిగా తీసుకోవాలన్న విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. కొన్ని సందర్భాల్లో నీటిని తప్పనిసరిగా తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు చేకూరతాయి. భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు లేదా భోజనం చేసిన 30 నిమిషాల తరువాత నీళ్లను తాగాలి. భోజనం మధ్యలో నీళ్లను తాగకూడదు. మధ్యమధ్యలో నీళ్లను తాగటం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కొవ్వుగా మారుతుంది. ఇది శరీరంలో పేరుకుపోతుంది. అది కాస్త అధిక బరువుకు దారి తీస్తుంది. భోజనం చేసే సమయంలో నీళ్లను తాగకుండా ఉండటం మేలు.

వ్యాయామం చేసిన తరువాత కూడా నీళ్లను తప్పనిసరిగా తాగాలి. వ్యాయామాలు చేయటం వల్ల చెమట రూపంలో ద్రవాలు బాగా బయటకు పోతాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కనుక వీటిని నియంత్రించాలంటే నీళ్లను తాగాలి. వ్యాయామం చేసిన 5 నిమిషాల తరువాత నీళ్లను తాగటం మంచిది. రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ నీళ్లను తాగాలి. దీని వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. రక్త సరఫరాకు ఆటంకాలు ఏర్పడవు. ఫలితంగా రాత్రి పూట గుండె పోటు రాకుండా నివారించవచ్చు. నీరసం, అలసట, నలతగా ఉన్న సందర్భంలో నీటిని బాగా తాగాలి. దీని వల్ల శరీరం అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. నీటిని రోజువారిగా తగిని మోతాదులో తాగటం వల్ల అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా నివారించుకోవచ్చు.

స్నానం చేయడానికి ముందు ఒక గ్లాస్ నీళ్లను తీసుకోవటం వల్ల బీపీ తగ్గుతుంది. స్నానం చేసే సందర్భంలో శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు తలెత్తుతాయి. ఈ ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించేందుకు త్కాలికంగా రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో బీపీ కూడా ఎక్కువవుతుంది. అయితే బీపీ పేషెంట్లకు ఇది మంచిది కాదు. కనుక వారు స్నానానికి ముందు ఒక గ్లాస్ నీళ్లను తాగటం ద్వారా బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.