Sweet Potato : ఎదిగే పిల్లలు ఉడికించిన చిలకడ దుంపలు తింటే!

చిలగడ దుంపలు చర్మసౌందర్యానికీ ఉపయోగపడతాయి. వీటిని తరచూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆహారాన్ని తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. పంటి సమస్యలను తగ్గించటంలో చిలగడ దుంపలో విటమిన్ సి తోడ్పడుతుంది.

Sweet Potato : ఎదిగే పిల్లలు ఉడికించిన చిలకడ దుంపలు తింటే!

Sweet Potato

Sweet Potato : చిలకడదుంపలో బంగాళదుంప, కందగడ్డలో కన్నా అధిక పోషకాలు ఉన్నాయి. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఎన్నో పోషకాలు కలిగిన చిలకడదుంపను తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చిలకడ దుంపలో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. చిలగడ దుంపల్లో శరీరానికి మేలు చేసే విటమిన్‌ సి, ఇ, బి6, బీటా కెరోటిన్‌, పొటాషియం, ఐరన్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి.

చిలకడ దుంప అధిక రక్తపోటును తగ్గిస్తుంది. చిలగడ దుంపలో పొటాషియం పుష్కలంగా ఉండటం కారణంగా అధిక రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యానికి, ఎముకలను బలపరచడానికి, క్యాన్సర్ లను సైతం దరిచేరకుండా చేస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చిలగడ దుంపలో బీటా కెరటిన్‌, విటమిన్ ఏ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కంటికి కావలసిన పోషకాలను అందించి కంటిచూపును మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక కంటి సమస్యలను తగ్గిస్తుంది.

చిలగడ దుంపలు చర్మసౌందర్యానికీ ఉపయోగపడతాయి. వీటిని తరచూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆహారాన్ని తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. పంటి సమస్యలను తగ్గించటంలో చిలగడ దుంపలో విటమిన్ సి తోడ్పడుతుంది. ఎదిగే పిల్లలకు చిలగడ దుంపలను ఉడికించి తినిపించడంతో వారి మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. చిలగడదుంపలో పాంథోనిక్ యాసిడ్ ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. చిలకడదుంపలో అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుంది.