BP Under Control : బీపీని కంట్రోల్ లో ఉంచాలనుకుంటే!

మద్యాన్ని ఎక్కువగా తాగటం వల్ల సైతం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మద్యం తాగే వారిలో బీపీ కంట్రోల్ చేసుకునేందుకు వాడే మెడిసిన్స్ ఏమాత్రం పనిచేయవు. కాబట్టి మద్యం సేవించటం అన్నది రోజువారిగా తగ్గిస్తూ క్రమేపి మానేయటం మంచిది.

BP Under Control : బీపీని కంట్రోల్ లో ఉంచాలనుకుంటే!

Bp Under Control

BP Under Control : ఇటీవలి కాలంలో అధిక ర‌క్త‌పోటు సైలెంట్ కిల్లర్ గా మారింది. ఎలాంటి లక్షణాలు పైకి కనిపించకుండానే మనిషిని దెబ్బతీస్తుంది. హై బీపీ, హై బ్ల‌డ్ ప్రెష‌ర్ కారణంగా అవయవాలకు నష్టం వాటిల్లుతుంది. రక్తపోటు కారణంగా చాలా మందిలో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు తలెత్తుతున్నాయి. రక్త పోటు 130/90 మి.మీ, అంతకన్నా ఎక్కువగా ఉన్నప్ఫుడు అధిక రక్తపోటుగా భావిస్తుంటారు. మనిషివయసు పెరిగే కొద్ది బీపీలో మార్పు కనిపిస్తుంది. ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో బీజీ సమస్యలను నియంత్రించుకోవచ్చు. బీపీని నియంత్రించటానికి  క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయటం అవసరం. రోజుకు 30 నిమిషాలపాటు వాకింగ్, జాగింగ్ వంటివి చేయాలి. ఇలా చేస్తే రక్తపోటు సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. వ్యాయామం మానుకోకుండా రోజు అనుసరించటం వల్ల సమస్య మరింత తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.

అదనపు బరువు కారణంగా కూడా బీపీ సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందుకుగాను తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుని బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ఇలా చేయటం వల్ల క్రమేపి రక్తపోటును నియంత్రించవచ్చు. కిలో బరువు తగ్గటం వల్ల 1ఎంఎం హెచ్ జీ వరకు రక్తపోటును తగ్గించుకోవచ్చు. ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం మంచిది.

మద్యాన్ని ఎక్కువగా తాగటం వల్ల సైతం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మద్యం తాగే వారిలో బీపీ కంట్రోల్ చేసుకునేందుకు వాడే మెడిసిన్స్ ఏమాత్రం పనిచేయవు. కాబట్టి మద్యం సేవించటం అన్నది రోజువారిగా తగ్గిస్తూ క్రమేపి మానేయటం మంచిది. దీని వల్ల బీపీని నియంత్రించటం సాధ్యమౌతుంది. రోజు వారి ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు సంతృప్త కొవ్వు ఆహారాన్ని తీసుకోవటం వల్ల అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు.

ధూమపానం అలవాటు ఉంటే దానిని మానేయటం మంచిది. దీని వల్ల రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. ధూమపానం మానేయడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి అధిక రక్తపోటుకు కారణమౌతుంది. అనారోగ్యకరమైన ఆహారం తినడం, మద్యం సేవించడం,ధూమపానం వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి కూడా అధిక రక్తపోటుకు దారితీస్తుంది. కాబట్టి ఒత్తిడి లేని జీవితాన్నిగడపటం ద్వారా రక్తపోటు సమస్యను తగ్గించుకోవచ్చు.