White Bread : వైట్ బ్రడ్ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమా!

మైదాతో తయారైన బ్రెడ్ లో ఎలాంటి ప్రోటీన్లు, విటమిన్లు లభించవు. మధుమేహం వ్యాధి గ్రస్తులు వీటిని తినకపోవటమే మంచిది. వీటిని తీసుకుంటే షుగర్ లెవల్స్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

White Bread : వైట్ బ్రడ్ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమా!

Weight Bread

White Bread : జ్వరంతోపాటు, చిన్నాపాటి ఆరోగ్యసమస్యలు తలెత్తినప్పుడు చాలా మంది బ్రెడ్ ను ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అనేక మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా జామ్ తో కలిపి బ్రెడ్ ను తీసుకోవటం అలవాటుగా చేసుకుంటారు. బ్రెడ్ తింటే సులువుగా జీర్ణం అవుతుంది… అందుకే ఎక్కువ మంది బ్రెడ్ ను తింటుంటారు. అయితే ఈ వైట్ బ్రెడ్ తినకూడదనే వారు చాలా మంది ఉన్నారు. వైట్ బ్రెడ్లో అధిక కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

బ్రెడ్ తయారీకి మైదా పిండిని వాడతారు. అధిక మోతాదులో మైదాతో తయారు చేసిన బ్రెడ్ ను ఆహారంగా తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గ్లూటెన్ కారణంగా ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. మైదాతో కూడిన బ్రెడ్ తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. బరువు పెరుగుతారు. స్థూలకాయంతో బాధపడేవారు వైట్ బ్రెడ్ తినకపోవటమే మంచిది. వైట్ బ్రడ్ ను  ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడుపై గ్లూటెన్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

మైదాతో తయారైన బ్రెడ్ లో ఎలాంటి ప్రోటీన్లు, విటమిన్లు లభించవు. మధుమేహం వ్యాధి గ్రస్తులు వీటిని తినకపోవటమే మంచిది. వీటిని తీసుకుంటే షుగర్ లెవల్స్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు, గుండె పోటులకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఇందులో ఉండే ఉప్పు అధికమోతాదు వల్ల గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతాయి. ఉదయం అల్పాహారంగా తీసుకుంటే అధిక కేలరీలు శరీరంలోకి వెళతాయి. వీటిలో ఉండే శుద్ధి చేసిన చక్కెర వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెదడు పై కూడా ప్రభాన్ని చూపిస్తుంది. అందుకే గోధుమలు, తృణధాన్యాలతో తయారైన బ్రెడ్లను ఆహారంలో చేర్చుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

గమనిక; ఈ కధనం కేవలం అవగాహన కోసమే…వివిధ మార్గాలనుండి ఈ సమాచారాన్ని సేకరించి అందించటం జరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించి తీసుకునే ఆహారం విషయంలో పోషకాహార నిపుణులను సంప్రదించి వారి సలహాలు , సూచనలు తీసుకోవటం మంచిది.