Belly Fat : పొట్టకొవ్వును కరిగించటంలో తోడ్పడే లిచీ ఫ్రూట్!

ఈ ఫ్రూట్ లో రూటిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను శరీరం ఎక్కువగా గ్రహించకుండా చేస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఇబ్బందులకు గురి అవుతున్నవారు లిచీ ఫ్రూట్ ను తీసుకోవడం కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.

Belly Fat : పొట్టకొవ్వును కరిగించటంలో తోడ్పడే లిచీ ఫ్రూట్!

belly fat

Belly Fat : ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పుల వల్ల చాలా మందిలో పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. పొట్టచుట్టూ కొవ్వు పేరుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని నియంత్రణలో ఉంచితే సులభంగా పొట్టకొవ్వును కరిగించుకోవచ్చు. అధిక కేలరీలు ఉండే ఆహారాలకు దూరంగా ఉండటంతోపాటు, చక్కెర, శీతలపానీయాలు, బేకరీ పదార్ధాలు వంటివాటిని తీసుకోరాదు. పొట్టకొవ్వును కరిగించటంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న పండ్లలో లిచీ ఫ్రూట్ వల్ల మంచి ఫలితాలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

పొట్టకొవ్వును కరిగించటంలో లిచీ ఫ్రూట్ ;

వేసవిలో మార్కెట్లో అందుబాటులో ఉండే రుచికరమైన లిచీ పండ్లు ఆరోగ్యానికే కాదు, బరువును తగ్గించటంలోనూ సహాయకారిగా పనిచేస్తాయి. ఈ పండు ఎంత రుచికరంగా ఉండటంతోపాటు జీవక్రియను పెంపొందించటంలో తోడ్పడుతుంది.

శరీరం చల్లబరిచే గుణం దీనిలో ఉంది. లిచీ గుండెకు చాలా మేలు చేస్తుంది. దీనిలో శరీరానికి కావాల్సినంత పొటాషియం ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి శరీరానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది.

లిచీ ఫ్రూట్ ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఎంతగానో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. లిచీ ఫ్రూట్ లో ఉండే ఒలిగోనల్ అనే మూలకం పొట్ట భాగంలో కొవ్వు కరిగేలా చేస్తుంది. అంతేకాకుండా అక్కడ కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో సహాయపడుతుందని నిపుణులు కనుగొన్నారు.

ఈ ఫ్రూట్ లో రూటిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను శరీరం ఎక్కువగా గ్రహించకుండా చేస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఇబ్బందులకు గురి అవుతున్నవారు లిచీ ఫ్రూట్ ను తీసుకోవడం కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.

రాత్రులు నిద్రపోయే ముందుగా, ఉదయం ఖాళీ కడుపున లిచీ పండ్లను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు వీటిని దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే కొన్ని రసాయనాల వల్ల ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.