Sore Throat: గొంతు నొప్పి బాధిస్తుందా.. ఇంటి చిట్కాతో సొల్యూషన్
గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు సమస్య ఏదైనా ఇంటి నుంచే పరిష్కారం వెతుక్కోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు, మరికొద్ది సూచనలు పాటిస్తే సరిపోతుంది.

Sore Throat
Sore Throat: గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు సమస్య ఏదైనా ఇంటి నుంచే పరిష్కారం వెతుక్కోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు, మరికొద్ది సూచనలు పాటిస్తే సరిపోతుంది. నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో చికాకు, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటీ లక్షణాలు మాత్రమే అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేషియల్ రీసెర్చ్ రిపోర్టులు చెబుతున్నాయి.
ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం, మౌత్ వాష్‌లు తరచుగా ఉపయోగించి సొల్యూషన్ వెతుక్కోవచ్చు. ఇలా చేసినప్పటికీ నోటి దుర్వాసన తగ్గలేదంటే తప్పనిసరిగా శరీరంలోని ఇతర సమస్యలకు సంకేతంగా భావించవచ్చని అంటున్నారు. గొంతు ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కూడా కొన్నిసార్లు నోటి దుర్వాసన సమస్యకు కారణమవుతాయి. డయాబెటిస్ సమస్యతో ఇబ్బందిపడేవాళ్లకు నోటి నుంచి కుళ్లిన పండ్ల వాసన, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లకు కుళ్లిపోయిన గుడ్ల వంటి వాసన వస్తుంది.
కొందరు దీనికి పరిష్కారం వెదక్కుండా.. వక్కపొడి, కిళ్లీలు వాడుతుంటారు. అవి సమస్యను మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రోజులు నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా డెంటిస్టులను సంప్రదించాలి. చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సమస్య తీవ్రత తక్కువగా ఉంటే ఈ చిట్కాల సాయంతో పరిష్కారం వెదుక్కోవచ్చు.
తులసి, తేనెలతో టీ
తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ కారకాలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. తులసిలో ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. తులసి, తేనెలతో చేసిన టీ పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పసుపు కలిపిన పాలు
పొడి గొంతు, దగ్గు సంబంధిత రుగ్మతలకు పసుపును తీసుకున్నట్టయితే వ్యాధుల నుంచి కాపాడటమే కాక, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గ్లాసు వేడిపాలల్లో, చిటికెడు పసుపు వేపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
నెయ్యితో మిరియాల పొడి
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నెయ్యిలో అధికంగా ఉంటాయి. టేబుల్ స్ఫూన్ వేడి నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తినండి. గొంతు తడిగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది.
ఉప్పునీరు
వేడి నీటిలో ఉప్పు కలిపి రోజుకి కనీసం రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన జిగట వంటి శ్లేష్మాన్ని కరిగించి పలచబరుస్తుంది.
హెర్బల్ టీ
పొల్యూషన్, దుమ్ముధూళి వల్ల గొంతులో చికాకు పుట్టించే సమస్యలకు శ్రేష్ఠమైన పరిష్కారం హెర్బల్ టీ. పచ్చ యాలకులు, లవంగ మొగ్గలు వంటి మసాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
మెంతుల డికాషన్
మెంతి గింజలను నీటిలో వేసి రంగు మారేంతవరకు ఉడికించాలి. ఈ డికాషన్‌ను చల్లార్చి, రోజుకు రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పొడి దగ్గు, గొంతు పొడిబారడం వంటి రుగ్మతల నుంచి బయటపడొచ్చు.