శాకాహారుల్లో మాంసాహారుల కంటే తక్కువ టెస్టోస్టిరాన్లు అనేది నిజమా.. కాదా..

శాకాహారుల్లో మాంసాహారుల కంటే తక్కువ టెస్టోస్టిరాన్లు అనేది నిజమా.. కాదా..

క్యారెట్లు లాంటి ఇతర దుంపలు తిని కూడా కండలు పెంచొచ్చని అనుకుంటున్నారు వెజిటేరియన్లు. శాకాహారుల్లో.. మాంసాహారాల్లోనే టెస్టోస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తి ఒకేలా ఉందట. 191 మంది మగాళ్లను వరల్డ్ జర్నల్ ఆఫ్ యూరాలజీ స్టడీ చేసింది. మాంసాహారం తినేవాళ్లకు తిననివాళ్ల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా అని శోధించింది. ఇందులో శాకాహారుల్లో 33ng/dL తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి.

షాకింగ్ విషయం ఏమిటంటే.. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి మాత్రం ఇద్దరిలో ఒకేలా ఉంది. ఈ స్టడీని మూడు రకాలుగా విడగొట్టారు. ఒకటి అన్ని ఆహారపదార్థాలు తినే వాళ్లు, రెండోది శాఖాహారులు, మూడోది ఆరోగ్యకరమైన డైట్ మాత్రమే ఫాలో అయ్యేవారు.

‘మాకు తెలిసిందేంటంటే శాకాహారుల్లో టెస్టోస్టిరాన్ లెవల్స్ నార్మల్ గా ఉన్నాయి. మాంసాహారం అడపాదడపా తినేవాళ్లలోనూ ఇదే లెవల్ లో ఉన్నాయి. అని యూనివర్సిటీ ఆఫ్ మియామీ డైరక్టర్ ఆఫ్ మేల్ రీ ప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ రంజిత్ రామసామి అన్నారు.

ఆశ్చర్యకరంగా హెల్తీ, రెగ్యూలర్ శాకాహారుల డైట్ లలో (జంక్ ఫుడ్ ) తినే వారిలో కూడా పెద్దగా తేడాలో ఏం లేవట. ఎక్కువ మాంసాహారం తినే వ్యక్తి, ఆరోగ్యకరమైన ఆహారం తినే వ్యక్తి, మాంసం-ఆకుకూరలు-కూరగాయలు లాంటివి తినే వ్యక్తుల్లోనూ ఈ లెవల్స్ ఒకేలా ఉన్నాయని సహ రచయిత మనీశ్ కుచకుల్లా అంటున్నారు.