Periods : నెలసరి సమయానికి రావటంలేదా?

రక్తహీనత వల్ల మహిళల్లో నెలసరి రాకపోవటం జరుగుతుంది. ఐరన్ లోపం ఉన్నప్పుడు శరీరం బలహీనపడి, నెలసరి సక్రమంగా రాకపోగా, క్రమం తప్పుతుంది. ఇందుకు రక్తహీనతను అధిగమించేలా మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి.

Periods : నెలసరి సమయానికి రావటంలేదా?

Periods

Periods : ఇరెగ్యులర్ పీరియడ్స్ చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. కొంతమందిలో నెలసరి లక్షణాలు కనిపించినప్పటికీ నెలసరిరాకపోవటం జరుగుతుంది. నడుము నొప్పి, కాళ్లు లాగడం, పొత్తికడుపులో నొప్పి వంటి ముందస్తు లక్షణాలు కనిపించినప్పటీకి పిరియడ్స్ మాత్రం రావు. ఈ ప్రాబ్లమ్ వల్ల మరికొన్ని సమస్యలు కూడా చుట్టు ముడతాయి. పెళ్లైన వారిలో కొంతమందికి అకస్మాత్హుగా నెలసరి రావలసిన తేదీలలో రాకుండా కొంత జాప్యం జరుగుతుంది . దీనికి అనేకరకమైన కారణాలు ఉండవచ్చు.

నెలసరి నిర్ణీత తేదిలలో రాకపోవటానికి నిద్రలేమి, శరీర అలసట, పని వత్తిడి, మానసికంగా ఇబ్బందులు, ఎక్కవ పనిభారం వంటివి కారణం కావచ్చు. అదేసమయంలో కొంత మందిలో మాత్రం అధిక బరువు, ఉబ్బసం, థైరాయిడ్, జన్యుపరమైన లోపాలు కూడా నెలసరి సరిగా రాకపోవటానికి కారణమవుతాయి. పిరియడ్స్ సక్రమంగా రాని పరిస్ధితిని యాన్ ఓవులేషన్ అంటారు. ఇలాంటి సందర్భంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మంచిది. వారి సూచనలు సలహాలు తీసుకుని చికిత్స పొందాలి.

కుటుంబ నియంత్రణ మందులను వాడే వారిలో సైతం నెలసరి సక్రమంగా రాకపోవటం వంటి మార్పులు గమనించవచ్చు. అతేకాకుండా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య, మూత్రాశయంలో ఇన్ ఫెక్షన్లు ఉన్న సందర్భంలో సైతం ఇలాంటి పరిస్ధితి రావచ్చు. అధిక వత్తిడులను ఎదుర్కోంటున్న మహిళల్లో కార్టిసార్ స్ధాయి పెరుగటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దాని ప్రభావం వల్ల నెలసరులపై పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బరువు కోల్పోవటం, వ్యాయామం అధికంగా చేయటం, ధూమపానం, కాఫీలు, మందులు, ఆహార లేమి, వంటివి కూడా క్రమం తప్పిన నెలసరికి దారితీస్తాయి.

రక్తహీనత వల్ల మహిళల్లో నెలసరి రాకపోవటం జరుగుతుంది. ఐరన్ లోపం ఉన్నప్పుడు శరీరం బలహీనపడి, నెలసరి సక్రమంగా రాకపోగా, క్రమం తప్పుతుంది. ఇందుకు రక్తహీనతను అధిగమించేలా మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, కుంగుబాటు, కడుపు సంబంధిత వ్యాధులున్నప్పుడు రుతుక్రమం దారి తప్పుతుంది. పేగులు ఆరోగ్యవంతంగా లేని మహిళల్లో పీరియడ్లు సరిగ్గా రావు. అతిగా కసరత్తులు చేసే వారిలో ఇలాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా క్రీడాకారులకు తప్పనిసరిగా ఎక్కువ గంటలు శ్రమించాల్సిందే. ఇలాంటి మహిళా క్రీడాకారుల్లో నెలసరి సమస్యలు వస్తాయి. 30 రోజులైనా పీరియడ్ రాకపోతేమాత్రం దాన్ని లేట్ పీరియడ్ అంటారు. 6 వారాల పాటు పీరియడ్ రాలేదంటే పీరియడ్ మిస్ అయినట్టుగా భావించాలి. ఇలా తరచు జరుగుతుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటం మంచిది.