Olive Oil : అందానికి ఆలివ్ నూనె! ముడతలు తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది

నీళ్లలో రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి వాటితో స్నానం చేస్తే విటమిన్‌ ఈ, ఎ  చర్మానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచడానికి తోడ్పడతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది. చర్మానికి అవసరమైన తేమను అందించి, మృదువుగా మారుస్తాయి.

Olive Oil : అందానికి ఆలివ్ నూనె! ముడతలు తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది

Olive Oil : చర్మంతో పాటు జుట్టు సంరక్షణకు ఆలివ్ అయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్, స్క్వాలేన్‌లతో పోరాడటానికి తోడ్పడతాయి. ఈ నూనెలో ఉండే ఫ్యాటీ లిపిడ్లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. మొటిమలకు కారణమయ్యే సెబమ్ ఉత్పత్తిని అదుపులో ఉంచడంతో పాటు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే ముడతలూ, గీతలను తొలగిస్తాయి.

నీళ్లలో రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి వాటితో స్నానం చేస్తే విటమిన్‌ ఈ, ఎ  చర్మానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచడానికి తోడ్పడతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది. చర్మానికి అవసరమైన తేమను అందించి, మృదువుగా మారుస్తాయి. స్నానానికి అరగంట ముందు ఆలివ్‌నూనెను ఒంటికి పట్టించి, తరవాత స్నానం చేసినా ఫలితం ఉంటుంది.

తరచూ మేకప్‌ వేసుకునే వారి చర్మం త్వరగా పొడి బారుతుంది. ఈ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలంటే మేకప్‌ను తొలగించడానికి ఆలివ్‌నూనెను వాడాలి. దాన్ని గోరువెచ్చగా చేసి ముఖానికి మర్దన చేసి, కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే కఠిన రసాయనాల ప్రభావం చర్మంపై పడకుండా ఉండటంతోపాటుగా, రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

గోళ్లు విరిగిపోతుంటే రోజూ ఐదు నిమిషాలు ఆలివ్‌నూనెతో మర్దన చేస్తే గోళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి. గోరు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. రంగు మారిన, పొడిబారిన జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది. వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. ఈ నూనెతో ఆయిల్ ట్రీట్‌మెంట్‌ చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది.