COVID-19: ఫస్ట్.. ప్రైమరీ స్కూల్స్ తెరవండి.. పెద్దల కంటే పిల్లలే ఇన్ఫెక్షన్ తట్టుకోగలరు!

వైరల్ ఇన్ఫెక్షన్లను చిన్నారులే ఎక్కువగా తట్టుకోగలరని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.అందుకే ముందుగా ప్రైమరీ స్కూళ్స్ తెరవాలని ఐసీఎంఆర్ సూచించింది.

COVID-19: ఫస్ట్.. ప్రైమరీ స్కూల్స్ తెరవండి.. పెద్దల కంటే పిల్లలే ఇన్ఫెక్షన్ తట్టుకోగలరు!

Open Primary Schools First As Kids Can Handle Infection Better

Open primary schools first as kids : వైరల్ ఇన్ఫెక్షన్లను చిన్నారులే ఎక్కువగా తట్టుకోగలరని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.అందుకే ముందుగా ప్రైమరీ స్కూళ్స్ తెరవాలని ఐసీఎంఆర్ సూచించింది. ఏదిఏమైనా.. స్కూల్ సిబ్బంది, టీచర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా సూచించింది. ‘వైరల్ ఇన్ఫెక్షన్లను పెద్దల కంటే పిల్లలే బాగా ఎదుర్కోగలని మాకు తెలుసు. యాంటీబాడీలు పెద్దల్లో మాదిరిగానే పిల్లల్లోనూ ఒకేలా ఉంటాయి. కొన్ని స్కాండీనేవియన్ దేశాల్లో మాత్రం ఎలాంటి కరోనా వేవ్ లొచ్చినా ప్రైమరీ స్కూళ్లను మూసివేయలేదు’ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు.

ఐసీఎంఆర్ నాల్గో జాతీయ సీరోసర్వే ఫలితాల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో 40 కోట్ల మందికి ఇంకా కరోనా రిస్క్ ఉందని వెల్లడైంది. దేశంలోని ఆరేళ్ల వయస్సు పైబడిన మూడింట రెండు వంతుల జనాభాలో SARS-CoV -2 యాంటీబాడీలు ఉన్నాయని తేలింది. కోవిడ్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసిఎంఆర్ జూన్-జూలైలో ఈ సర్వే నిర్వహించింది. 6 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భారత జనాభాలో మూడింట రెండు వంతుల లేదా 67.6 శాతం మంది జాతీయ సెరోసర్వేలో SARS-CoV-2 యాంటీబాడీలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.

దేశ జనాభాలో మూడోవంతు మందికి SARS-CoV-2 యాంటీబాడీలు లేవు. అంటే సుమారు 40 కోట్ల మంది ఇప్పటికీ COVID-19 బారినపడే రిస్క్ ఉందని పేర్కొంది. ప్రభుత్వం ప్రకారం.. సర్వే చేసిన 85 మంది ఆరోగ్య కార్యకర్తలలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయి. HCW లలో పదోవంతు ఇంకా గుర్తించలేదన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. సామాజిక, మత, రాజకీయ సమాజాలను నివారించాలని, అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని ప్రభుత్వం సూచించింది. పూర్తిగా టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది.


జూలై 20న అప్ డేట్ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 30,093 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 125 రోజులలో అతి తక్కువగా నమోదైంది. కరోనా కేసుల సంఖ్య 3,11,74,322కు చేరుకుంది. ఇక కరోనా మరణాల సంఖ్య 4,14,482కు చేరుకుంది. రోజువారీ కరోనా మరణాలు 374 చేరగా.. 111 రోజుల్లో యాక్టివ్ కేసులు 4,06,130కు తగ్గాయి. 117 రోజుల్లో ఇదే తక్కువగా చెప్పవచ్చు.