Facial Beauty : ముఖ సౌందర్యాన్ని పెంచే మసాలా దినుసులు! ఆ రెండింటితో…

దాల్చినచెక్క లో ఉండే యాంటి బ్యాక్టిరియాల్‌ గుణాలు చర్మంలోని బ్యాక్టిరియను సమర్జవంతముగా ఎదుర్కొని చర్మం సహజ సౌందర్యం పొందటానికి తోడ్పడుతుంది. స్కిన్ టోన్ మెరుగుపరచడంలో మరియు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో ఎలా సహాయపడుతుంది.

Facial Beauty : ముఖ సౌందర్యాన్ని పెంచే మసాలా దినుసులు! ఆ రెండింటితో…

Spices that enhance facial beauty! With those two...

Updated On : February 22, 2023 / 10:18 AM IST

Facial Beauty : మసాలా దినుసులను మనం నిత్యం ఆహార పదార్ధాల్లో ఉపయోగిస్తుంటాం. అంతేకాకుండా పూర్త కాలం నుండి వీటిని ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. వీటిని ఉపయోగించటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు సైతం సూచిస్తున్నారు. అదే క్రమంలో ఈ మసాల దినుసులను సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు.

మార్కెట్‌ లో దొరికే ఖరీదైన కృత్రిమ సౌందర్య సాధనాలను ఉపయోగించటం కంటే మన వంటగదిలో పోపులపెట్టేలో ఉన్న మసాలా దినుసులతో మంచి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం రోజు వినియోగించే దాల్చిన చెక్క, మిరియాలు ఈ రెండింటిలో సౌందర్యాన్ని పెంపొందించే గుణాలు ఉన్నాయి. ఈ మసాలా దినుసులను ఉపయోగించి అందమైన చర్మాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. దాల్చినచెక్క ;

దీనిని బిరియాని, ఫ్రైడ్‌ రైస్‌ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. గరం మసాలా పొడులలో తయారీలో కూడా దాల్చిచెక్కను వాడతారు.. ఇది మనం తయారుచేసుకునే ఆహారాలకు ఎంతో రుచిని,వాసనను కలిగిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దాల్చినచెక్క ముఖ సౌందర్యాన్ని పెంచటానికి ఎంతో దోహదం చేస్తుంది. దాల్చిన చెక్క చర్మం యొక్క కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది,

దాల్చినచెక్క పొడిలో కొంచెం నీరు కఠిపి వేస్ట్‌ గా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది.

క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తే ముఖం మీద ఉండే వేడి పొక్కులు,మొటిమలు తగ్గుతాయి. దాల్చినచెక్క లో ఉండే యాంటి బ్యాక్టిరియాల్‌ గుణాలు చర్మంలోని బ్యాక్టిరియను సమర్జవంతముగా ఎదుర్కొని చర్మం సహజ సౌందర్యం పొందటానికి తోడ్పడుతుంది. స్కిన్ టోన్ మెరుగుపరచడంలో మరియు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో ఎలా సహాయపడుతుంది.

అలాగే దాల్చిన చెక్క పొడికి కొద్దిగా తేనే, కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వేస్ట్‌ చేసి,దానిని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు ఊడటం తగ్గుతుంది. అయితే దీనిని ఉపయోగించటానికి ముందు బ్యూటిషియన్‌ సలహా తీసుకోవాలి.

2. మిరియాలు ;

ఘాబైన రుచితో ఉండే మిరియాలను వంటలలో తరచూ వాడుతూ ఉంటాము. జలుబు,జ్వరం వంటి రుగ్మతలకు మిరియాలు చక్కని పరిష్కారం చూపుతుందని మన పెద్దలు నమ్మేవారు. అంతేకాకుండా ఆహారం త్వరగా జీర్ణం కావటానికి కూడా సహాయపడుతుంది. నల్లటి వలయాలను, మచ్చలను తొలగించుకోవాలంటే.. మిరియాలను ఉపయోగించుకోవచ్చు.

మిరియాలు ఆరోగ్యానికే కాకుండా సౌందర్య పోషణలో చక్కగా ఉపయోగపడతాయి. మిరియాలను మెత్తగా పొడి చేసుకొని దానిలో పెరుగు కలిపి పేస్ట్‌ చేసి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు. అయితే ఈ చిట్కా పొడి చర్మం వారికీ అంతగా ఉపయోగపడదు. ఇలా చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది.

పెరుగులో నల్ల మిరియాల పొడిని కలిపి, ఈ మిశ్రమాన్నిముఖంపై అప్లై చేసి, కనీసం పది నుంచి 15 నిమిషాల పాటు వుంచి ఆపై నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెరుపుదనం సంతరించుకుంటుంది.