Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?

అనేక మంది మెడనొప్పి వచ్చిన వెంటనే నెక్ కాలర్ వేస్తుంటారు. దీని వల్ల ఉపయోగం ఉండదు. కంప్యూంటర్ వద్ద పనిచేసే సమయంలో భుజాలు, మోచేతులు సమాంతరంగా ఉండాలి. కంప్యూటర్ కీబోర్డుకు మణికట్టు సమాంతరంగా ఉండాలి.

Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?

Neck Pain

Neck Pain : మనిషి శరీరంలో మెడ బాగం చాలా ప్రధానమైనది. తలకు మొండేనికి మధ్య ఇదొక బాల్ బేరింగ్ లా ఉంటుంది. ఇటీవలి కాలంలో మెడ సమస్యలతో బాదపడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంది. నడక, పడక, కూర్చునే విధానం ఇవన్నీ మెడనొప్పికి దారితీస్తున్నాయి. వాహనాలు నడిపే క్రమంలో మెడపై ఒత్తిడి పెరుగుతుంది. చిన్నాపాటి మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తే తరువాత అది స్పాండిలైటిస్ దారి తీస్తుంది. చిరకు నెక్ సర్జీరీకీ దారితీసే పరిస్ధితి రావచ్చు.

90 శాతం మందిలోకూర్చునే తీరు, పనిచేసే విధానం వల్లే మెడనొప్పి వస్తుంది. ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో మణికట్టు , భుజాలు సరైన దిశలో పెట్టకపోవటం వల్ల మెడపై ప్రభావం పడుతుంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు పనిచేయటం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పడి మెడనొప్పి వస్తుంది. పడుకోవటంలో సరైన పద్దతులు పాటించకుంటే నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. మెడనొప్పికి శస్త్ర చికిత్స తప్ప మరో మార్గంలేదు.

అనేక మంది మెడనొప్పి వచ్చిన వెంటనే నెక్ కాలర్ వేస్తుంటారు. దీని వల్ల ఉపయోగం ఉండదు. కంప్యూంటర్ వద్ద పనిచేసే సమయంలో భుజాలు, మోచేతులు సమాంతరంగా ఉండాలి. కంప్యూటర్ కీబోర్డుకు మణికట్టు సమాంతరంగా ఉండాలి. టూవీలర్ నడుపుతున్నప్పుడు నిటారుగా ఉండి భుజాలు మెడకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం ఐదారు సార్లు నెక్ వ్యాయమం చేయాలి. రెండు చేతులూ తల వెనుక అదిమి పట్టి ముందుకు , వెనకకు స్ట్రెచ్ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గంటల సమయం కుర్చీలకే పరిమితం కాకుండా మధ్యమధ్యలో లేచి కొద్ది సేపు అటు ఇటూ తిరగాలి.