Summer : వేసవి వచ్చేసింది…జాగ్రత్తలు తప్పనిసరి!

ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజులు వంటి సీజనల్ పండ్లను తీసుకోవాలి.

Summer : వేసవి వచ్చేసింది…జాగ్రత్తలు తప్పనిసరి!

Heat Waves

Summer : వేసవి కాలం వచ్చేసింది. ఈ సారి ఎండలు గరిష్ఠ స్థాయిలో ఉండవచ్చునని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. వడగాలులతో నీరసం, అలసట, తీవ్రమైన దాహం, వడదెబ్బ వంటి వాటికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీంతో రకరకాల అనారోగ్యాల బారిన పడుతుంటారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జాగ్రత్తలు పాటించటం అత్యవసరం.

వేసవిలో ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. కాఫీ, టీ లను తీసుకోకపోవటమే మంచిది. వాటి స్థానంలో రాగి జావ తాగాలి.ఇమ్యునిటి పెరుగుతుంది. కూల్ డ్రింకులు బదులుగా కొబ్బరి నీరు తాగాలి. పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి.

ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజులు వంటి సీజనల్ పండ్లను తీసుకోవాలి. ఉదయం పుట అల్పాహారంగా నూనె తో చేసిన వంటలు కాకుండా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటి వాటిని తీసుకోవాలి. కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేర్ల తెరలను తడిపి కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా చల్లగా ఉంచుతుంది. పిల్లలకు దాహం వేసినా, వేయకపోయినా తరచుగా నీటిని తాగించాలి.

ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవడం మంచిది. ఉదయం వేళ వ్యాయామం చేయడం ఉత్తమం. ఆల్కహాల్‌, కార్బొనేటెడ్‌ వంటి ద్రావణాలకు దూరంగా ఉండ డం మంచిది. వీటి వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. బయటకు వెళ్లే ముందు నీళ్లు తాగటం మంచిది. కాటన్‌, లైట్‌ వెయిట్‌ ఉన్న దుస్తులు ధరించడం మరీ మంచిది. ఎండవేడికి నరాల సమస్య సైతం వస్తుంది. రక్తపోటు పెరిగి, గుండెపై ఒత్తిడి అధికం అవుతుంది. దీని నుండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలి. వేసవి కాలంలో మధ్యాహ్నం ఎండ అధికంగా ఉన్న సమయంలో ఎక్సర్‌సైజ్, జిమ్ లాంటి చేయడం ఆరోగ్యానికి మంచిదికాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.