Butter Milk : అజీర్ణ సమస్యలకు చక్కని ఔషదం… మజ్జిగ

మజ్జిగలో తక్కువ మొత్తంలో కొవ్వు మాత్రమే ఉంటుంది. అందువల్ల బరువు తగ్గించుకోవడానికి మజ్జిగ చాలా మంచిది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.

Butter Milk : అజీర్ణ సమస్యలకు చక్కని ఔషదం… మజ్జిగ

Butter Milk (1)

Butter Milk : మజ్జిగ తాగడం మన శరీరానికి ఎంతో మంచిది. వేడి వాతావరణంలో మజ్జిగ వంటి చల్లని పదార్థాల వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇళ్లలో చాలా మంది నిత్యం తీసుకుంటుంటారు. మజ్జిగను భోజనం తర్వాత తీసుకోవటం చాలా మందికి అలవాటు. అయితే వీటిని రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. పెరుగులో నీరు పోసి చిలకటం ద్వారా మజ్జిగా తయారు చేస్తారు. మజ్జిగలో జీలకర్ర పొడి, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కలిపి నూరి వేసి రుచికరమైన మజ్జిగను తయారు చేసుకుని తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మజ్జిగ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మజ్జిగలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్స్, లాక్టోస్, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మలబద్ధకం సమస్య ఉంటే, రోజూ మజ్జిగ తీసుకోవడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది. విరోచనం సాఫీగా జరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి మజ్జిగ వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, రోజూ ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల శరీరంలో కొలొస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె పోటు ముప్పు నుండి మజ్జిగ కాపాడుతుంది.

ఆహారంతోపాటు మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అసిడిటీని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి మజ్జిగ మేలు చేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్ అంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడదు. మజ్జిగలో ఉండే గుణాల వలన కడుపులోని పోషకాలు త్వరగా జీర్ణమవుతాయి. దీంతో అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో విటమిన్ డి ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. అలాగే కాల్షియం శోషణను సులభం చేస్తుంది. మల ద్వారం చుట్టూ దురదకు మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. దీనివల్ల మలంలోని ఆమ్లత్వం తగ్గి దురద తొలగిపోతుంది.

మజ్జిగలో తక్కువ మొత్తంలో కొవ్వు మాత్రమే ఉంటుంది. అందువల్ల బరువు తగ్గించుకోవడానికి మజ్జిగ చాలా మంచిది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. మహిళలకు పీరియడ్స్ తర్వాత మజ్జిగ తీసుకోవడం మంచిది. రోజూ ఖాళీ కడుపుతో మజ్జిగను తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ రిస్క్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ప్రత్యేక రకాల జీవ అణువులు మజ్జిగలో ఉన్నాయి. మజ్జిగలో ఉండే యాక్టివ్ ప్రొటీన్లు యాంటీ క్యాన్సర్, యాంటీ బాక్టీరియల్, యాంటీ-వైరస్ ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది.